Friday, August 29, 2014

దేశభక్తిని ప్రజల్లొ నిర్మాణం చేయటం కష్టమా?

విదేశీ సహాయం లేకుండా మనపై మనకు నమ్మకముండి ఎమైనా చేయలేమా?ఎందుకో గాని ఆ విశ్వాసమే మనకు కలగటం లేదు.అన్ని పనులు మనం చేసుకోకపోవచ్చును.జపాన్,జర్మనీ ల వలే అద్భుతాలు సృష్టించడానికి,కావలసిన దేశభక్తిని ప్రజల్లొ నిర్మాణం చేయటం కష్టమా?మన ప్రభుత్వం ఇది కలిగించటం ఊహించగలదా?మన ఆర్థిక వ్యవస్థ బలంగా సాగటానికి కావల్సింది పెట్టుబడి అయితే,ఆ పెట్టుబడిని మనం పొదుపు చేయటం ద్వారా సాధించగలము.మనం గుర్తించటం లేదు కాని మన కుటుంబం అనే వ్యవస్థ కారనంగా మనం ఇప్పటికే 38శాతం పైగా పొదుపు చేసాము.ఇంత రేటు అమెరికా,యూరప్ దేశాల్లొ లేదంటే ఆశ్చర్యం వేస్తుంది.అమెరీకా పొదుపు రేటు (-)0.4 కి చేరింది.


మన పొదుపు కారణంగా సుమారు 12లక్షల కోట్ల రుపాయలు మన వద్ద మూలధనం వుందంటే మామూలు విషయం కాదు కదా?విదేశాలను బిచ్చమెత్తవలసిన పనిలేదు కదా? ఆత్మస్థైర్యం పెంచుకుని,సృజనాత్మకతతో అభివృద్ధిమార్గంలో ప్రయాణం చేయవచ్చును.మన అవసరాలకు కావలసిన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి.చిన్నచిన్న వస్తువులన్నిటికి విదేశాలపై ఆధారపడకూడదు.ఏదైన విజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవలసి వస్తే, మన పరిస్తితులకు అనుగుణంగా మార్చుకుని,ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా,ఆర్థిక వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నడిపించాలి.దేశ ఆర్థిక వ్యవస్థ 4 గురు మంత్రుల చేతుల్లో కాదు,ప్రతి భారతీయుడికి ఇందులో భాగస్వామ్యం వుందని అర్థం చేసుకోవాలి.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers