Tuesday, December 13, 2016

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో డిశంబరు 10న శనివారం సంచార జాతుల ప్రజల గ్రామంలో సర్వే నిర్వహించింది























సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో డిశంబరు 10న శనివారం సంచార జాతుల ప్రజల గ్రామంలో సర్వే నిర్వహించింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం " ముత్యంపేట" గ్రామంలో 50 పైగా సంచార జాతుల కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి.
జిల్లా కేంద్రం సిద్దిపేట కు 15 కిమీ దూరంలో వున్న గోవర్ధనగిరి గ్రామానికి పల్లె ఈ ముత్యంపేట.
ఇప్పటికి ఆర్థికంగా,సామాజికంగా వెనకబడిన ఈ పల్లె ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితుల్లొ బ్రతుకుతున్నారు.

విద్యాగంధం లేక,పరిశుభ్రత పాటించక అనారోగ్యం పాలవుతూ,పనులు లేక ఆదాయం లేక,అప్పుల బారిన పడి,మూఢనమ్మకాలు పాటిస్తూ, అప్పు తెచ్చిన మొత్తాన్ని మద్యానికి, జంతు బలులకు దుర్వినియోగం చేస్తూ తమ జీవితాలు బలి చేసుకుంటూ వున్నారు.
అంతోఇంతో విద్య నేర్చిన యువకులపై, కుల పెద్దలు తమ భావాలను రద్దుతున్నారని వాపోతున్నారు.
పక్కా ఇళ్ళు లేక గుడిసెల్లో వుంటున్నారు. అపరిశుభ్రత వాతావరణంలో గడుపుతున్నారు
పిట్టలు, నక్కలు వేటాడి బ్రతుకులు వెళ్ళదీస్తున్నారు.


కారు చీకటి లో కాంతి రేఖవలె ఉపాధ్యాయులు లక్ష్మణ్, రామేశ్వర్ రెడ్డి లు బాల బాలికల్లో విద్యాగంధం అబ్బడానికి కృషి చేస్తున్నారు.
ఇక్కడి ప్రజల పెద్ద మనిషి పెంటయ్య (75 వయస్సు ) ప్రభుత్వ కార్యాలయ వెంట తిరిగి ఎస్ టి సర్టిఫికెట్ ఆ బస్తీ ప్రజలకు తెప్పించి పేరు గడించాడు. ప్రస్తుతం ఆయన పక్షవాతం తో బాధపడుతున్నాడు

సామాజిక సమరసత వేదిక కార్యకర్తలు మాట్ల సుమన్ ఆధ్వర్యంలో కనకం,కుమార్,సతీష్,కరుణాకర్,విశాల్, మహేశ్,శ్రీనివాస్, రవి,కాల్వ వినోద్, యాదగిరి, చంద్రశేఖర్ అర్జున్ ఈ సర్వేలో పాల్గొన్నారు. సామాజిక సమరసత వేదిక సిధ్దిపేట జిల్లా అధ్యక్షుడు రత్నం, తడ్కపల్లి ఆవాసము ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, విలక్షణ్, సోమేందర్, మెతుకు రాజు పాల్గొన్నారు. సర్పంచ్ ఎల్లం, ఉపసర్పంచ్ గోపాల్ పాల్గొన్నారు
ఈ పల్లె నుండి 12మంది అందె గ్రామానికీ చదువుకోసం వెళ్లే వారికి సామాజిక సమరసత వేదిక ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేసింది. ఆధ్యాత్మిక భావవ్యాప్తికి గణపతి నవరాత్రులు అర్చకులతో జరిపించి, విలువల గొప్పతనం వివరించింది.
50 మంది బాలబాలికలకు పరిశుభ్రత,భజనలు, మంచి మాటలు పలికే పద్ధతులు నేర్పించింది.
గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు నరేశ్ బాబు ఆధ్వర్యంలో 6 గురు వైద్యబృందం ఈ పల్లెలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, 200 మందికి వైద్య పరీక్ష నిర్వహించింది.
ప్రభుత్వ పథకాలు అందక. దుర్భరమైన జీవనం గడిపే ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ అండదండలు తప్పనిసరి యని గుర్తించింది
సామాజిక సమరసత వేదిక సమగ్ర సర్వే జరిపి, సంచార జాతి ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి నడుం కట్టింది.
- అప్పాల ప్రసాద్.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers