Saturday, November 12, 2016

ఇటువంటి దసరా అన్ని వూర్లల్లో జరిగితే ....ప్రజలు సామరస్యంగా జీవిస్తారు.








దసరా సంబరాలు దేశంలో వూరూరా ఘనంగా ఎన్నో ఏళ్ళు గా జరుగుతున్నాయి. ఈ వూర్లో కూడా అంతే. కాకపోతే వూరి ప్రజలు అందరూ డప్పుల శబ్దాలు మ్రోగుతుంటే కలిసి నడుస్తారు. ఆడ,మగ,పేద,ధనిక, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీ ల నాయకులు అన్నీ మరిచిపోయి అందరూ వరుసలో నిలుచుని భారత మాత ప్రార్థన చేస్తారు. (ఐర్లండు కు చెందిన మార్గరెట్‌ ఎలిజబెత్‌ (సోదరి నివేదిత ) చెప్పిన విధంగా భారతీయులు కలిసి దేశమాతను రోజూ ప్రార్థిస్తే ఈ దేశం శక్తివంతమవుతుందన్నది). ఒక వరుసలొనే కూర్చుని దసరా సందేశాన్ని శ్రద్ధ గా వింటారు. పూజ తరువాత జమ్మి ఆకులు అందరికీ పంచుతారు. గత 15 సంవత్సరాలు గా ఈ పద్ధతి కొనసాగుతుంది. ఈ గ్రామం పేరు కొత్త గడి మల్కాపూర్, సంగారెడ్డికి 2 కిమీ దూరంలో వుంది. మెదక్‌జిల్లాలొ వుంది. ఈ గ్రామ హనుమాన్ గుడి లొ ప్రతి రోజు భగవద్గీత చదువుతారు. ప్రతి శనివారం అన్ని కులాలవారు భజనలు చేస్తారు. సురేందర్ రెడ్డి కుటుంబం గ్రామ ప్రజల ఐక్యత కు అంకితం. ఈ ప్రేరణ తొ యువకులు, విద్యార్థులలో దేశభక్తి పొంగిపొరలుతుంది.
దసరా, దశకంఠ రావణుని సంహరించి న రోజు. దసరా , పాండవుల శక్తివంతమైన ఆయుధాలు జమ్మి ( శమీ వృక్షము) చెట్టు పై దాచి, దసరా రోజున తీసి, పశువుల ను దొంగతనం గా తోలుకుని పోతున్న కౌరవులను గెలిచిన రోజు.దసరా, అమ్మ వారు, ఆదిశక్తి ని తొమ్మిది రోజులు ఉపాసన చేసి శక్తిని పొందే రోజు. అవన్నీ గుర్తు చేసికుని ప్రేరణ పొందుతారు.
రావణాసురుడు బ్రాహ్మణ వంశము లో జన్మించాడు. బుద్ధి వక్రీకరించి, సీతమ్మ ను చెరపట్టాడు. రాముడు రావణుని సంహరించాడు. లంకా రాజ్యము విభీషణునికి అప్పగించాడు. ఆ రావణుడు కూడా గతంలో విష్ణువు వద్ద ద్వార పాలకుడిగా వుండి, శాపం కారణంగా రావణ,కుంభకర్ణులు గా జన్మించారు. చివరకు చంపబడి, విష్ణువు వద్దకు వెళ్ళారు. మరి రావణ వధ ను ఒప్పుకున్న వారు గతంలో విష్ణు భక్తులని ఒప్పుకొని తీరాలి కదా! అయితే రావణుడు శూద్ర మహారాజని, రాముడు ఆర్యుడని, చరిత్రను ను వక్రీకరించి, గ్రామాలలో కులాల మధ్య చిచ్చు పెట్టి ఆనందపడే మతి కోల్పోయిన కొందరు అక్కడక్కడ దర్శనం ఇస్తారు. ఎటూచేసి, రామాయణం రంకు కాదని, నిజంగా చరిత్ర యేనని గట్టిగా నమ్ముతున్నట్లే కదా!.
ఆర్యులంటే మంచివారని, ఆర్యులు బయట నుండి వచ్చిన జాతి వారు కాదని, డాక్టర్ అంబేద్కర్ ' శూద్రులు ఎవరు ' అనే పుస్తకంలో స్పష్టంగా వ్రాశారు. అయినా వీరి చెవికెక్కదు. ఎందుకు? మూర్ఖులు కాబట్టి ......అంబేద్కర్ సంస్కృతం నేర్చుకొని, హిందూ ధర్మాలను అవహేళన చేయలేదు. సత్యాన్ని గ్రహించారు.
కమ్యూనిస్టులు, కంచ ఐలయ్య శిష్యులు, ఆర్.ఎస్‌. ప్రవీణ్ కుమార్ మానస పుత్రిక స్వ్యారో సభ్యులు, సమాజ విధ్వంసక నక్సలైట్లు, సమతా సైనిక దళాలు ఇవన్నీ దేశంలో ఒక కులాన్ని మరో కులంపై దాడి జరిపే చర్యలను జరుపుతుంటారు. దసరా, దీపావళి, బతుకమ్మ లు జరుపుకోవద్దని ఉద్యమిస్తున్నారు.
నరకాసురుని వారసులమని చెపుతూ కృష్ణుని ఆరాధించే వారిపై యుద్దం చేస్తున్నారు. ఆ నరకాసురుడు భూదేవి కి విష్ణువు వరం తో జన్మించాడని వీరికి తెలియదా? మొత్తంమీద కృష్ణుడు, మహాభారతం నిజంగా జరిగిందనీ నమ్మినందువల్లనేనా ప్రచారము చేస్తున్నారు?. బుద్దుని పేరుతో, అంబేద్కర్ పేరుతో ఎస్ సి లను, నిమ్న వర్గాల ప్రజలను గందరగోళానికి గురిచేసి, అధికారం కోసం రాజకీయాలు నడిపుతూ, కుటుంబం, వివాహం, పండుగ లు, దేశభక్తి, అన్ని వర్గాల ప్రజల సేవ ----ఇలా ఇవన్నీ కాలదన్నుతూ సమాజ విధ్వంసక రచనకు ఉపక్రమించారు. మావోయిష్టులతొ చేతులు కలిపి, దేశం పై యుద్ధం చేస్తున్న పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు మద్దతు నిస్తూ, ఈ దేశాన్ని, హిందూ సంస్కృతి ని వ్యతిరేకించే శత్రువులతొ స్నేహం చేసి, ప్రశాంత జీవన భారత దేశంలో చిచ్చు పెట్టడానికి వ్యూహ రచన చేస్తున్నారు. విదేశీ మిషనరీలు నిధులు అందజేస్తున్నాయి. హిందూ ధర్మాన్ని కూకటి వ్రేళ్ళతో దేశం నుండి పెకిలించే పనిలో పావులు కదుపు తున్నారు.
ఇటువంటి వెన్నపోటు,నమ్మక ద్రోహుల గురించి డాక్టర్ అంబేద్కర్ 1949 నవంబరు 26 న రాజ్యాంగ సభలొ ముందు గానే హెచ్చరించారు. మహ్మద్ బిన్ కాశిమ్ తొ, మహ్మద్ ఘోరీతొ,అక్బర్‌ తొ, ఆంగ్లేయుల తొ మనం ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఈ దేశంలో ని ద్రోహులే కారణమని చెపుతూ, మన స్వతంత్ర భారతాన్ని కాపాడు కోవాలని ఉద్బోధించారు. అంబేద్కర్ అడుగు జాడల్లో నడుద్దాం. అన్ని వర్గాల ఆచారాలను గౌరవించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుందాం.
- Appala Prasad.

1 comment:

  1. ఇటువంటి దసరా అన్ని వూర్లల్లో జరిగితే ....ప్రజలు సామరస్యంగా జీవిస్తారు.

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers