లచ్చపేట ఎస్ సి లు ( దళితులు) అంటరానితనం గోడలు కూల్చేసారు. ఇంటి ఇంటికి వెళ్ళి రాఖీలు కట్టారు. మనమంతా బంధువులమని చాటిచెప్పిన ఆదర్శ యువకులు.
మెదక్ జిల్లాలోని దుబ్బాక వద్ద నున్న లచ్చపేట గ్రామం లో అంబేడ్కర్ యూత్ ఆస దీపక్, విజయ్,ఆస నరేశ్,ఆస అనిల్, నర్సిములు,గణేశ్ ఇంకా 30 ఎస్ సి బంధువులు పద్మశాలి,మంగళి,గంగపుత్ర మొదలైన అన్ని కులాల ఇండ్లకు వెళ్ళారు. అక్కా, చెళ్లెళ్లతొ రాఖీలు కట్టించుకున్నారు. హిందువులం మనమంతా ..ఒకే రక్తమందరిది...అని చాటి చెప్పారు ..డా అంబేడ్కర్ చెప్పినట్లు ఏ కులమైనా అందరిలొ వున్నది ఒకే రక్తమని, లచ్చపేట అంబేడ్కర్ యూత్ ఆచరించి చూపించి ముందడుగు వేశారు. హిందువుల నుండి మమ్మల్ని విడదీయలేరని, ఒక కులాన్ని రెచ్చగొట్టి మరొక కులంపై ఉసిగొల్పే పనులు చేయవద్దని ఐఎఎస్,ఐపిఎస్ హోదాలలో వుండి గ్రామాలలో చిచ్చు పెట్టేవారికి వీరి వేసిన అడుగు ఒక హెచ్చరిక. అన్ని కులాల వారితొ స్నేహం చేయడానికి మేం సిద్ధం. కలుపుకునే విశాల హృదయం కలిగి వుండాలని స్నేహ హస్తం చాపారు.
లచ్చపేట గ్రామంలో అన్ని కులాలు ఆ హృదయం కలిగివున్నాయి. ఆ సవాల్ ని స్వీకరించిన పద్మశాలి కులానికి చెందిన శ్రీకాంత్ ఎస్ సి లను(మాల,మాదిగ) ఇంటికి పిలిచి అక్క,చెల్లెలు తొ రాఖీ కట్టించాడు. అంతేకాదు శివాజి యూత్ ముందుకు వచ్చి 15 ఇండ్లకు తీసుకొని వెళ్ళారు. మంచినీరు ఇచ్చారు. చాయ్ పోశారు. స్వీట్లు తినిపించారు.
ఇదెలా జరిగింది? శ్రీకాంత్ ఆధ్వర్యంలో గత సంవత్సరం ఎస్ సి బస్తీకి వెళ్లిన పరిణామం ఇది...
ReplyDeleteలచ్చపేట ఎస్ సి లు ( దళితులు) అంటరానితనం గోడలు కూల్చేసారు. ఇంటి ఇంటికి వెళ్ళి రాఖీలు కట్టారు. మనమంతా బంధువులమని చాటిచెప్పిన ఆదర్శ యువకులు.