*వేద నినాదాన్ని మ్రోగించి, సామాజిక సమరాన్ని సాగించిన స్వామి వివేకానంద అందరికీ ఆచరణీయం.
*స్వామి వివేకానంద మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడి దగ్గర నుండి హుక్కా తీసుకుని పొగ పీల్చారు.
*50 మంది బ్రాహ్మణేతరులను గంగా స్నానం చేయించి, జంధ్యం ధరింప చేసి, గాయత్రీ మంత్రోపదేశం ఇచ్చారు.ఆ తరువాత ఉపనిషత్తులు, శ్రీ భాష్యం వంటి గ్రంథాలను ఎర్రని వస్త్రం లొ చుట్టి వారి చేత తాకించారు.
*స్వామి వివేకానంద ఒక చోట ప్రవచనాలిస్తున్నా , వారి భొజనం సంగతి ఎవరూ పట్టించుకోలేదు..ఒక చెప్పులు కుట్టే వ్యక్తి వంట సామాన్లు ఇచ్చి, వండుకుని తినమంటే,ఆ నిమ్న వర్గపు వ్యక్తి చేతనే వండించి తింటారు.ఈ విషయం తెల్సిన ఖేత్రీ మహారాజు వెంటనే ఆ చెప్పులు కుట్టే వ్యక్తిని పిలిచి,అతడు మహా భక్తుడని ఎరిగి జీవితాంతం అతని అవసరాలు తీర్చే వ్యవస్థ చేశాడు.
*ఒక బావి వద్ద నీళ్ళు తోడుతున్న వ్యక్తి, తాను అంటరానివడినని అన్నప్పుడు,రాముని స్పర్శతో రాయి మనిషిగా మారింది..రాముని జపిస్తూ మంచి నీళ్ళివ్వమని స్వామిజి సలహా ఇస్తాడు.
*విదేశాల్లో వున్న హైందవేతరులందరికీ సుమారుగా 4 వేల మందికి ప్రణవ మంత్రమిచ్చి శిష్యులుగా చేర్చుకున్న సమరసతా విప్లవకారుడు స్వామి వివేకానంద..
*1896 లో చేన్నై లోని మత్సకారుల గుడిసెల్లోకి వెళ్ళి ఆశీర్వదించివచ్చారు.
అలాగె పేద బ్రాహ్మణులను చేరదీసి వారికి ఉపనయనం చేసి, వారికి భోజనం మరియు విద్యా సదుపాయాలు కల్పించారు.
*నారాయణ గురు శిష్యుడైన డా. పల్ప్ తో మాట్లాడి, కేరళ లో అంటరానితనపు తీవ్రత మీద చర్చించి ఆవేదన చెందారు.తన కేరళ పర్యటలో ఆ ప్రాంతాన్ని ' ఒక పిచ్చివాళ్ళ రాజ్యంగా వర్ణించారు..
*సృష్టి అంతటా భగవంతుని తత్త్వం వుందనే వేద నినాదాన్ని మ్రోగించి, సామాజిక సమరాన్ని సాగించిన స్వామి వివేకానంద అందరికీ ఆచరణీయం.
- అప్పాల ప్రసాద్
వేద నినాదాన్ని మ్రోగించి, సామాజిక సమరాన్ని సాగించిన స్వామి వివేకానంద అందరికీ ఆచరణీయం
ReplyDelete