Tuesday, June 7, 2016

అరుణాచల రమణ మహర్షి - కావ్య కంఠ గణపతి ముని



బ్రాహ్మణులంటేనే అన్నికులాల వారిని సమదృష్టి తో చూసేవారని నిరూపించిన మహాను భావులు..

రమణులు మరియు వారి శిష్యులు గణపతి ముని.

అరుణాచల రమణ మహర్షి (1879-1950)

ఆధ్యాత్మిక ధృవతార వారు..

అన్ని కులాలవారితో కలిసి కూర్చుని భోజనం చేసేవారు.

నిమ్నవర్గాల వ్యక్తులు తన వద్దకు రాకపోతే, తానే వెళ్ళి, శివ శివ అంటూ అనిపించి, మంత్రోపదేశం చేశారు.

వారి అమ్మగారు మడి మడి అని అహంకరిస్తూ అంటూ వుంటే, తల్లికి నెమ్మదిగా నచ్చ చెప్పాడు.

పాల్ బ్రంటన్ అను పాశ్చాత్య చరిత్రకారుడుని రమణ మహర్శి వద్దకు పంపి వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే రచనకు ప్రేరకులు కంచి మహా స్వాములవారు.

కావ్య కంఠ గణపతి ముని (1878-1936)

20 ఏళ్ళ వయస్సులోనె అన్ని శాస్త్రాల్లొ దిట్ట వారు.

గురుకులం లోని విద్యార్థులకు వంట వండి పెట్టడానికి ఒక నిమ్న వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తాడు.

కుల ప్రాతిపదికన భేదాలు వేదాలు అంగీకరించవని చెప్పాడు.

బెల్గాం కాంగ్రెస్ సభలొ అస్పృశ్యత కు వ్యతిరేకంగా ఉపన్యాసమిచ్చాడు.

స్త్రీలకు ఆర్థిక,సాంఘిక, ఆధ్యాత్మిక హక్కులు పురుషులతో సమానంగా అందాలని కోరాడు.

కులాలవారిగా విడిపోయిన భారత దేశాన్ని, మళ్ళీ శక్తివంతం చేయమని భారత మాతను ప్రార్థిస్తూ ఒక శ్లోకం వ్రాశాడు.

1923 కాకినాడ కాంగ్రెస్ సభలో మాట్లాడుతూ సామాజిక అసమానతలు దేశ్ ఐక్యతకు మంచిదికాదని,కల్పిత శ్లోకాలతో మానవుల మధ్య అంతరాలు సృష్టించ వద్దని కోరుతాడు.

అంటరాని తనం మీద 89 సూక్తులు వ్రాసి కాంగ్రెస్ సభలో కరపత్రాలు పంచిపట్టాడు.

1927 లో భాగ్యనగర్ లో భాగ్య రెడ్డి వర్మ నాయకత్వం లో మాడపాటి హన్మంత రావ్ ఇంటి నుండి చాదర్ ఘాట్ ఆది హిందూ భవన్ వరకు కావ్య కంఠ గణపతి మునిని వూరేగించారు.వారి నిమ్న వర్గాల అభ్యున్నతికి చేసిన కృషికి గుర్తింపుగా వారికి ముని అనే బిరుదునిచ్చి గౌరవించారు.
- అప్పాల ప్రసాద్.

4 comments:

  1. అరుణాచల రమణ మహర్-కావ్య కంఠ గణపతి ముని

    ReplyDelete
  2. Replies
    1. ధన్యవాదములు శ్యామలీయం గారు. నేను గమనించిలేదు. అది అరుణాచల రమణ మహర్షి-కావ్య కంఠ గణపతి ముని.

      Delete
  3. కావ్యకంఠ గణపతి ముని గారు తెలుగువారే. వాశిష్ట గణపతి ముని అని కూడా అంటారు. "ఉమా సహస్రం" అనే వెయ్యిపద్యాల పుస్తకం కూడా వ్రాశారు గణపతి ముని.

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers