Thursday, June 2, 2016

అహంకారం వదిలి,సామరస్యత ను చాటిన గాడ్గే బాబా


అహంకారం వదిలి,సామరస్యత ను చాటిన గాడ్గే బాబా..
డా.అంబేద్కర్ హిందూ మతం నుండి మారడానికి గాడ్గే బాబా ని సలాహా అడిగితే, మన ధర్మానికి హాని జరగకుండా చూడాలని సూచించాడు.
1876 ఫిబ్రవరి 23న జన్మించిన గాడ్గే బాబా...అసలు పేరు జానోర్కర్ చాకలి కులస్థుడు.పరులకు సేవ చేయటం,వ్యవసాయ పనులు చేస్తూ,భజన మండల్లో పాల్గొంటూ,సన్యాసిగా మారాడు.
తలపై బిక్షా పాత్ర బోర్లించి, చేతిలో చీపురు పెట్టుకుని,రంగు రంగుల గుడ్డ పీలికలు ధరించి వూరూరా తిరుగుతూ, ఆధ్యాత్మిక, సామాజిక కీర్తనలు పాడుతుంటాడు.గాడ్గే అంటే మట్టిపాత్ర అని అర్థం.
జంతు బలి వద్దని, మద్యం ముట్టుకోవద్దని, అంధ విశ్వాసాలు పాటించవద్దని ప్రబోధిస్తాడు.150 పైగా అనాథ శరణాలయాలు,గోశాలలు, ఆస్పత్రులు , బాలికా సదన్ లు , వృద్ధాశ్రమాలు స్థాపించాడు.
పండరీపురం జాతర తరువాత అక్కడ మురికిని శుభ్రం చేసేవాడు.నిమ్న వర్గాల ప్రజల కొసం ప్రత్యేకంగా మొట్ట మొదటి ధర్మశాల నిర్మించాడు...దానికి చొక్కా మేళా అని పేరు పెట్టాడు.
మెహర్ బాబా, తుక్డోజి మహరాజ్ లతో సౌమ్యంగా వుండే వాడు..
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. అహంకారం వదిలి,సామరస్యత ను చాటిన గాడ్గే బాబా

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers