Tuesday, June 7, 2016

స్వామి దయానంద సరస్వతి (1827-1883)



మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, భాగ్య రెడ్డి వర్మ వంటి సంస్కర్తలకు ప్రేరణ నిచ్చిన స్వామి దయానంద సరస్వతి 1827-1883 మధ్యలో జీవించాడు.ఆర్య సమాజాన్ని స్థాపించారు.

వేదమంత్రాలు స్త్రీల తో సహా అందరూ చదవడానికి అధికారం వుందని యజుర్వేదం లోని 26 వ అధ్యాయం,2 వ మంత్రాన్ని గర్జించి వినిపించారు.

" ఓం యథేమాం వాచం కల్యాణీ మావదాని జనేభ్య:

బ్రహ్మరాజన్యాభ్యాగుం శూద్రాయ చార్యాయ చస్వాయ చరణాయ " (యజు :26-2)

భావం : బ్రాహ్మణ క్షత్రియుల కొరకు, వైశ్య శూద్రుల కొరకు , స్త్రీలు అతి శూద్రుల కొరకు నేను వేదములను ప్రకటించాను."

భగత్సింఘ్, ఆజాద్ చంద్ర శేఖర్, రాం ప్రసాద్ బిస్మిల్, లాలా లజపత్ రాయ్,శ్యాంజి కృష్ణ వర్మ వంటి ఎందరో దేశభక్తులు దయానంద సరస్వతి ప్రభావం తో పనిచేశారు.

తెలంగాణా లో రజాకార్లతో వీరోచిత పోరాటం చేసిన ఘనత ఆర్యసమాజ్ ది.

రాజా రామ్మోహన్ రాయ్

1828 లో బ్రహ్మ సమాజం స్థాపించి అప్పటి హిందూ సమాజం లోని మూఢాచారాలను ముఖ్యంగా సతీ సహగమనం ' ను నిషేధించడానికి బ్రిటిష్ వారితో చట్టం చేయించాడు.

ఉపనిషత్తుల్లోని కొన్ని అంశాలను బ్రహ్మ సమాజ సూత్రాలుగా స్వీకరించాడు.

స్త్రీల వికాసానికి కృషి చేశాడు.

సామూహిక భోజనాలు ఏర్పాటు చేశాడు.

కుల వ్యవస్థపై ఎదురుతిరిగాడు.

మానవులంతా ఏకత్వం వైపు సాగాలని ఆకాంక్షించారు.

1 comment:

  1. స్వామి దయానంద సరస్వతి (1827-1883)

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers