Thursday, June 2, 2016

నామదేవుడు...భక్త తుకారం ఒకరిని మించిన వారొకరు


దర్జీ కులం లో పుట్టిన నామ దేవుడు, చొక్కమేళాకు గురువయ్యాడు.

భగవంతుని ముందు అందరూ సమానులే అని చాటిచెప్పాడు.

ఈయన వ్రాసిన 61 కీర్తనలు గురుగ్రంథసాహెబ్ లో చేర్చారు.పంజాబ్ లో నామదేవుడికి గుడి కట్టారు.

జ్ఞానదేవుడి వద్ద శిష్యరికం చేశాడు. నామదేవుడు ఒకరోజు నాగనాథ దేవాలయం ముందు భజన చేస్తుంటే అర్చకుడు గుడి వెనకకు పంపిస్తాడు.అక్కడ కృష్ణ భక్తితో నృత్యం చేస్తాడు.గుడి పశ్చిమ దిక్కు తిరుగుతుంది.ఇప్పటికీ ఆ గుడి పశ్చిమ దిక్కులో తిరిగి వుండటం చూస్తాం.

భక్త తుకారాం కి పాదాభి వందనం చేసిన చత్రపతి శివాజి..

కుంభీ కులంలో పుట్టిన వర్కారి వంశస్తుడు భక్త తుకారాం 13 శతాబ్దం లోని వాడు.

బీద వాడైనా కూడా, దాన ధర్మాలు చేస్తాడు.

ఈ సంప్రదాయం వారు ఇప్పటికీ,నడుస్తూ,భజన చేస్తూ, పాండురంగణ్ణి దర్శించి వస్తారు.

ధనిక, పేద, చిన్న, పెద్ద కులముల పట్టింపు లేకుండా ప్రచారం చేస్తాడు.

పుట్టింది శూద్ర కులమైనా ఆయన భక్తికి మెచ్చి, స్వయానా దేవుడే తుకారాం ని సశరీం తో తన వెంట తీసుకుని వెళ్ళాడని ప్రజలు నమ్ముతారు.

పాండు రంగ హరి..రామకృష్ణ హరి...అని పాడుతూ తరించండంటూ తుకారం ప్రజలకు సందేశమిచ్చి వెళ్తాడు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. నామదేవుడు...భక్త తుకారం ఒకరిని మించిన వారొకరు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers