మనుస్మృతి అప్పటి రాజ్యాంగం...ఏ కాలానిదో ఎవరు చెప్పలెక పొతున్నారు.అందులో ముఖ్యంగా 2685 శ్లోకాలున్నాయి.అయితే ఆ తరువాత 800 సంవత్సరాలు విదేశీయుల బానిసత్వంలో వున్నప్పుడు అదనంగా 1502 శ్లోకాలు జోడించారు.ఒరిజినల్ గా 1183 శ్లోకాలు మాత్రమే వుండేవి.ప్రముఖ ప్రాచ్య పరిశోధకులు డా.సురేందెర్ కుమార్ నేడు లభ్యమవుతున్న మనుస్మృతి లోని శ్లోకాలు , ప్రాచీన స్మృతిలో లేవని చెప్తున్నారు.
అయితే మనుస్మృతి చదివిన తరువాతనే వివక్షత మొదలైందనటం అబద్ధం.చదవకున్నా కూడా అది ఎవరూ బొధించక పోయినా కూడా మనువాదం అంటూ విమర్శించటం ఒక ఫ్యాషన్ అయిందీరోజుల్లో. ఇదొక మానసిక జాఢ్యం. ఇది వదలించుకోకపోతే సమాజాన్ని నాశనం చేస్తుంది.విదేశీ చరిత్రకారులు మన వద్ద వున్న ఎన్నో స్మృతుల గురించి పేర్కొన్నారు కాని మనుస్మృతి గురించి ఎక్కడా చెప్పలేదు.
అవసరం లేనివీ, పనికి రానివీ, వివక్షత చూపించేవీ వేటినైనా సరే, తొలగించే సంపూర్ణ స్వేచ్చ హిందూ సమాజం లో వుంది. ఇస్లాం, క్రైస్తవం వలే పుస్తకాలే ప్రజలకు శిరోధార్యమని ఎప్పుడూ చెప్పలేదు.యుగానికి అనుకూలంగా మార్పులు చేస్తూ సమాజాన్ని కలిపి వుంచటమే హిందువుల లక్ష్యం.మనం రాసుకున్న రాజ్యాంగాన్నే 110 సార్లు మార్పులు చేసుకున్నం మనుస్మృతి ఎంత.?
ఒరిజినల్ గా వున్న శ్లోకాల్లో మంచి విషయాలు వున్నప్పుడు స్వీకరించటం తప్పు కాదు కదా?
డా అంబేద్కర్ చెప్పకున్నా కూడా చెప్పినట్లుగా మసిపూసి మాయ చేసి , సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు ఎల జరుగుతున్నాయో, 800 సంవత్సరాల బానిసత్వ కాలం లో మనువు చెప్పని విషయాలు కల్పించి, జోడించి హిందూ సమాజం పై నింద వేసే ప్రయత్నం అప్పుడు జరిగిందనేది వాస్తవం.
డా అంబేద్కర్ అప్పటి హిందుసమాజ వివక్షత కు వ్యతిరేకంగా కేవలం సింబాలిక్ గా తగులబెట్టమని చెప్పాడు.ఈ రోజు అంబేద్కర్ పేరు చెప్పుకుని ఇప్పటి హిందూ సమాజం పైన దుమ్మెత్తి పోస్తున్నారు. అప్పుడు అంబేద్కర్ హిందూ సమాజం లోని వివక్షత తొలగాలని, కలిసివుండాలని ఉద్యమిస్తే, నేడు తమ కుల సంఘాల మనుగడ కోసం,అధికారం కోసం, ఎంత వివక్షత తొలగకుండా వుంటే,అందరూ కలవకుండా వుంటేనె అంతగా తమకు లాభమని స్వార్థం తో ఉద్యమిస్తున్న సంస్థలు నేడు మనం చూడవచ్చును.
- అప్పాల ప్రసాద్.
సమరసత వున్న శ్లోకాలు వుంటే స్వీకారం. లేకుంటే తిరస్కారం .
ReplyDelete