Saturday, May 28, 2016

సమరసత ఆచరించిన బుద్ధుడు


కులాల కూకటి వ్రేళ్ళను పెకిలించ ప్రయత్నించిన మొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు.
హిందు సమాజం లో వున్న అంధవిశ్వాసాలను కూల దోల్చి, భారత కిరణమై వెలిగిన మహాత్ముడు బుద్ధుడు.ప్రెమ,కరుణ ,దయ అనే మూడు రత్నాలతో ఆకర్శించి లక్షలాదిమందిని అనుయాయులుగా చేర్చుకున్నాడు..భారతీయ సంస్కృతీ వారసత్వాన్ని ఖండాంతరాల్లోకి తీసుకుని పోయిన లైట్ ఆఫ్ ఏసియా గా పేరుపొందాడు.
సర్వజీవులూ సమానమే అని చెప్పాడు.కులవ్యవస్థను తూర్పార పట్టాడు.చెట్లు, జంతువులు,కీటకాలు, పక్షులలో తేడాలున్నాయి కాని మనుషుల్లో ఎటువంటి తేడా లేదని,అందరి అవయవాలు అందరికీ సమానమేనని బోధించాడు.వారిలో కులభేదాలు వుండటానికి వీల్లేదంటాడు బుద్ధుడు.
సునీతుడనే నిమ్నవర్గానికి చెందిన వ్యక్తి బుద్ధుడి కి దూరంగా జరుగుతుంటే,దగ్గరకు పిలిచి తల నిమిరి ఆత్మీతయతను పంచాడు.బౌద్ధ్ దీక్ష ను ఇచ్చాడు.
మేక పిల్లను గ్రామ దేవతకు బలి ఇస్తుంటే వారించాడు.తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.
బుద్ధత్వమే నిజమైన కులం....వ్యక్తుల అంతర్గత సౌశీల్యం,మానవత, కరుణ లే సమాజం లో వారిని గొప్పవారిగా నిలబెడతాయి.
సత్యం,ధర్మం,శుచి వున్నవాడే నిజమైన బ్రాహ్మణుడని వ్యాఖ్యానించాడు.ఇదే విషయాన్ని ధర్మరాజు మహాభారతం లో యక్ష ప్రశ్నలకు జవాబిచ్చాడు.
ఓ కులములో పుట్టినంత మాత్రాన ఉన్నతమైన వ్యక్తి అనుకోవటం అవివేకం అంటాడు బుద్ధుడు.
ఆత్మ దీపో భవ...ఎవరిపైన ఆధారపడక నీలోని ఆత్మను దర్శించి విముక్తి పొందాలని సూచించాడు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. సమరసత ఆచరించిన బుద్ధుడు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers