మన సమాజానికి శాపం అంటరాని తనం..ఇది తొలగించడానికి ఆదిశంకరులు, రామానుజులు,బసవేశ్వరుడు,స్వామి వివేకానంద,గురునానక్,దయానంద సరస్వతి,సంత్ రవిదాస్,వీర సావర్కర్,నారాయణ గురు,డా.హెడ్గేవార్, లాలా లజ్పతి రాయ్ ,మహాత్మా ఫూలే,భాగ్యరడ్డి వర్మ, గాంధిజీ వంటి మహనీయులు,ఆర్యసమాజం,ప్రార్థన సమాజం, హిందూ మహాసభ,సంత్ సమాజ సంస్థ ,బహిస్కృత హితకారిణీ సభ,ఆర్ ఎస్ ఎస్ వంటి ఎన్నొ సంస్థలు చెస్తున్న కృషి వెలకట్టలేనిది.అయినా కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ సమస్య మిగిలి వుంది.సామాన్య ప్రజానీకం లో అవగాహన లేని కారణం , అజ్ఞానం వల్ల ఇంకా హిందూ సమాజానికి హాని జరుగుతున్నది.అలాగే రాజకీయ కారణాలు కూడా కులాల మధ్య చిచ్చు పెడుతున్నది.డా. అంబేద్కర్ ఈ అంటరాని తనానికి వ్యతిరేకంగా , వందల సంవత్సరాలుగ పీడనకు గురవుతున్న వారి అభివృద్ధికి నడుం బిగించారు.
1920 లో నాగ పూర్ లో 18 కులాల వారిని పిలిచి సామూహిక భోజనాలు ఏర్పాటు చేసారు డా అంబేద్కర్.
1927 లో చౌదర్ చెరువు వాడు కోవడానికి నిమ్న జాతుల్లో ధైర్యం నింపారు.అదే ఏడు నాసిక్ లో దేవాలయ ప్రవేశ ఉద్యమం చేసారు.1930 లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లో స్వతంత్ర భారత దేశం లో నిమ్న వర్గాలకు సమానత్వం కావాలని కోరారు.
మూకనాయక్,బహిష్కృత భారత్ వంటి పత్రికలకు సంపాదకత్వం వహించారు.
ఇలా ఎన్నెన్నొ ఉద్యమాలు..ఎవరివరితోనో చర్చలు ..ఇవన్నీ బడుగు ప్రజల ఉన్నతి కోసమే..
(ఐతే హిందువులనుండి ఎస్ సి లను వేరు చేయాలనే లక్ష్యం తో పని చెస్తున్న కంచ ఐలయ్య, ప్రవీన్ కుమార్, కాకిమాధవ రావ్ వంటి మరి కొందరు విద్యావంతులు దేశాన్ని విభజించే ప్రమాద కర చర్యలకు మద్దతు పలుకుతున్నారు.రావణాసురుల , నరకాసురుల వారసులమని, దసరా,దీపావళి,దసరా బతుకమ్మ పండుగలను జరుపుకోవద్దని రెచ్చగొడుతున్నారు.దేశం లోని అన్ని వర్గాలతో కలిసి సహజీవనం చెస్తూ, అంబేద్కర్ వలే బుధ్హిమంతులు కావాలని చెప్పకుండా ఇతర కులాల వారిపై ఉసిగొల్పే విద్రోహ కార్యకలాపాలు ప్రభుత్వ ఉద్యోగాల ముసుగులొ చెస్తున్నారు.జె ఎన్ యూ లొ అఫ్జల్ గురు, హెచ్ సి యూ లో యాకూబ్ మేమెన్ వంటి దేశద్రొహుల చిత్రపటాల పక్కన అంబేద్కర్ ఫొటో పెట్టి విద్రోహ కార్యకలాపాలు చేస్తున్న విద్యార్థుల, సంఘాల కు మద్దతు తెలిపే పనుల్లో బిజీ,బిజీగా వ్యూహాలు పన్నుతున్నరు..దలితులను రజాకార్ ఒవైసీ అనుచరుల చెతుల్లో, క్రైస్తవుల కౌగిట్లో, నక్సలైట్ల పిడికిల్లో,కమ్యూనిస్టుల సిద్ధాంతాల్లో ఇరికించి దళితుల జీవితాలను సర్వనాశనం చెయాలని చూస్తున్న వీళ్ళంతా దళితుల నిజమైన నాయకులంటే ఎవరు నమ్ముతారు? వీళ్ళ చర్యలు డా అంబేద్కర్ సిద్ధాంతానికి విరుద్ధం కాదా ఆలోచించండి.)
- అప్పాల ప్రసాద్.

ReplyDelete