డా.అంబేద్కర్ ని 1935 లో ఆర్ ఎస్ ఎస్ సంక్రాంతి ఉత్సవానికి ఆహ్వానించింది.నేను దళితున్ని నేను హిందువుని కాదు అనుకోలేదు .అందుకే వెంటనే ఒప్పేసుకుని శాఖకు వెళ్ళాడు..
అలాగే రెండవసారి 1939 లో ఏప్రిల్ 16 న పూన శిబిరానికి వెళ్ళారు. ఆర్ ఎస్ ఎస్ క్యాంప్ లో ఎందరు ఎస్ సి లు వున్నారొ తెలుసుకుందామని వచ్చాను.కాని ఇక్కడి వాతావరణం చూస్తుంటే నేను అంటరాని వాణ్ణి అనే భావన నే మరిచిపోయాను అంటూ డా అంబెద్కర్ అభిప్రాయపడ్డారు..అప్పటికే అంటే 1935 లో తాను హిందుమతం లో పుట్టినా , ఆ మతం లో చావనని ప్రకటించాడు..అయినా ఆర్ ఎస్ ఎస్ శిబిరానికి ఎందుకు వచ్చారు.? ఆర్ ఎస్ ఎస్ ని స్థాపించిన డా హెడ్గేవార్ దూర దృష్టి అటువంటిది. రానున్న రోజుల్లో నిమ్న వర్గాల ప్రగతికి రాచ బాట వేయగల నాయకుడు అంబెద్కరేనని వారు ముందుగానే ఊహించారు..అంటరానితనాన్ని తొలగించే పనిలో ఆర్ ఎస్ ఎస్ ఒక నిశ్శబ్ద విప్లవంగా పనిచేస్తే, డా అంబేద్కర్ ఒక సామాజిక ఉద్యమాన్ని నడిపించి సమానత్వం తీసుకుని వస్తాడని హెడ్గేవారు అభిప్రాయపడ్డారు.
అంతే కాదు మహారాష్ట్ర లో భండార ఉప ఎన్నికల్లో డా అంబేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డప్పుడు, అప్పటి రెండవ అఖిల భారత ఆర్ ఎస్ ఎస్ అధ్య్క్షుడు గురూజీ గోల్వాల్కర్, వారి గెలుపు కోసం ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపిచ్చారు.ఒక పూర్తి సమయ కార్యకర్త శ్రీ దత్తోపంత్ థెంగ్డీ ని డా అంబేద్కర్ తన అనుచరుడిగా ఎంపిక చెసుకున్నారు.ఆర్ ఎస్ ఎస్ పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు.అయితే అప్పట్లో ఆర్ ఎస్ ఎస్ శక్తి తక్కువ కాబట్టి, అప్పటి హిందూ సమాజం లో వెంటనే మార్పు తీసుకొచ్చే స్థితి ఆర్ ఎస్ ఎస్ కి రాలేదని వారు అభిప్రాయపడ్డారు.
మహరాష్ట్ర లో వారి సంస్మరణ పత్రిక కు గురూజి గోల్వల్కర్ ఒక సందేశాన్ని వ్రాసి పంపారు.అంబేద్కర్ గతించిన తరువాత ఆర్ ఎస్ ఎస్ ప్రతినిత్యం మహాపురుషులను స్మరించుకునే స్తోత్రం లో డా అంబేద్కర్ పేరును, మహాత్మా ఫూలే పేరు ను కూడా వుంచి, స్వయం సేవకులు స్మరిస్తారు.అప్పటికీ ఈ దళిత సంఘాలు లేవని గుర్తుపెట్టుకోవాలి.ఇప్పటికీ ఆర్ ఎస్ ఎస్ శిబిరాల్లో వేలాది మంది ఎస్ సి వర్గాని కి చెందిన వారు స్వయం సేవకులుగా, హిందువులుగా, భారతీయులుగా గర్వపడుతూ దేశానికి సేవ చెస్తున్నారు.కీలకమైన బాధ్యతలు చేపడుతూ సమాజం లో డా అంబేద్కర్ బాటలో నడుస్తున్న వారెందరో వున్నారు.ఎస్ సి బస్తిల్లో సేవా కార్యక్రమాల ద్వారా విద్య, సంస్కారాన్ని పొందుతున్న బాల బాలికలు లక్షల్లో వుంటారు.
ఆయన జీవిత కాలం లో ఎప్పుడూ ఆర్ ఎస్ ఎస్ ని విమర్శించలేదు.హిందూ సంస్కృతిని ద్వేషించలేదు.
( అయినప్పటికినీ కొన్ని దళిత సంఘాలు,కొందరు విద్యావంతులు పని గట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆర్ ఎస్ ఎస్ కి వ్యతిరేకంగా కరపత్రా లు ముద్రించి పంచుతున్నారు.ఇదంతా వారి రాజకీయ ఎత్తుగడలో భాగమే.తమ దళిత సంఘాల మనుగడ, అస్తిత్వాలను కాపాడుకోవటం కోసం ఈ జాతీయ జీవన స్రవంతి నుండి దళితులను వేరు చేయటం కోసం వారు చేస్తున్న కుట్ర లో భాగంగా సమస్యలు సృష్టిస్తున్నారు.సమాజం లో తమ కలాల ద్వారా,గొంతుకల ద్వారా విష ప్రచారం చెస్తున్న తీరు చూస్తుంటే, ఒక యుద్ధవాతావరణం నెలకొల్పి, హింసాత్మక సంఘటనలకు పురికొల్పుతున్నారు.హెచ్ సి యూ లో విద్రోహ విద్యార్థుల వెనక వున్న వారెవరో, వారికి బహిరంగ మద్దతు ఇస్తున్నవారెవరో ఒకసారి పరిశీలిస్తె అర్థమవుతుంది.చీటికి మాటికీ ఎస్ సి అట్రాసిటీ కేసులు పెట్టటం, యాద్రుచ్చికంగా చనిపోయినవారికి కులం రంగు పులిమి అల్లర్లు చేయటం, ఎస్ సి కాకున్న ఎస్ సి పేరు చెప్పి ఉద్యమాలు చేసి, విధ్వంసం సృష్టించటం ఇవన్నీ చూస్తుంటే నిజమైన ఎస్ సి వర్గాల ప్రయోజనాలు, గౌరవం దెబ్బతింటున్నది.అంబేద్కర్ కన్నా అఫ్జల్ గురు, యాకూబ్ మెమెన్ లే దళితులకు ఆదర్శ మూర్తులుగా చిత్రీకరిస్తున్న వీరి మూర్ఖ ధోరణి దేశానికే ప్రమాదం.)
- అప్పాల ప్రసాద్.
డా.అంబేద్కర్ ని 1935 లో ఆర్ ఎస్ ఎస్ సంక్రాంతి ఉత్సవానికి ఆహ్వానించింది.నేను దళితున్ని నేను హిందువుని కాదు అనుకోలేదు .అందుకే వెంటనే ఒప్పేసుకుని శాఖకు వెళ్ళాడు..
ReplyDelete