డా.అంబేద్కర్ 125 వ జయంత్యుత్సవాలు
*నాలో ఏవైనా మంచి గుణాలున్నాయంటే అవి నా హిందూ మతపరంగా వచ్చినవే.అయితే మతపరంగా దురాగతాలను నేను సహించను అని అన్నారు.విద్య లెకున్న పరవాలేదు కాని మంచి ప్రవర్తన మాత్రం తప్పకుండా వుండాలని అంటారు.మన సమాజం ప్రధానంగా మత విశ్వాసాలపై అధారపడి వుందని దాంతో మనిషి మంచివాడయ్యే అవకాశాలు ఎక్కువని అదే తన అభిప్రాయమని చెప్పారు.
* అంబేద్కర్ కున్న మేధా శక్తి చూస్తే , ఆయన విదేశాల్లో స్థిరపడిపోతే ఎన్నో మంచి అవకాశాలు పొందేవారు..స్వదెశం మీద, తన ప్రజల పట్ల వున్న ప్రేమాభిమానాలు ఈ దేశం లోనె వుండి సమాజాన్ని సంస్కరించారు.స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగం రచన ను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫ్రాన్స్ కి చెందిన రాజ్యాంగ నిపుణుడు 'జెస్ జెర్రీ' అప్పగించాలని సూచించినప్పుడు, గాంధిజీ సలహా మేరకు డా. అంబేద్కర్ కి అప్పగించగానే 2సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో 395 ప్రకరణలు,8 షెడ్యూల్లతో అతిపెద్ద రాజ్యాంగాన్ని వ్రాసి,అందులో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కలిపించాడు.అంతే గాదు..దలితులను హిందువులనుండి వేరు చేయకుండా, హిందు కోడ్ బిల్లు పెట్టి, ఎస్ సి ల తొ సహా బౌద్ధులు, సిక్కులు, జైనులను కూడా హిందు కోడ్ లో కలిపిన నిజమైన సమగ్రతా , సమతావాది డా. అంబేద్కర్.
* సంస్కృతం నేర్చుకుని జర్మనీ లో సంస్కృతం బోధించారు.
* డిసెంబర్ 12, 1947 లో రాజ్యాంగ సభ లో మాట్లాతూ నేడు ప్రజలు రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాల వల్ల ప్రజలు చిన్న వర్గాలుగా విడిపోయినట్లు కనిపించినా,ఒకే జాతిగా అందరూ నిలబడగలరని విశ్వసిస్తున్నట్లు భావించారు. దేశవిభజన కోరుతున్న ముస్లిం లేగ్ కూడా అఖండ భారత్ వల్లనే అందరికీ ప్రయోజనం జరుగుతుందని భావించే రోజు వస్తుందని వారి ఆశించారు.
* హిందుత్వం లోని ఆచార సంప్రదాయాలు ఉన్నతమైనవని అంటారు డా అంబేద్కర్.అయితే కొందరు సంకుచితమైన వారి చెతిలో పడి,కులాల వారిగా విడిపోయే స్థితికి వచ్చిందని వారు బాధ పడ్డారు.
* కమ్యూనిజం గురించి కమ్యూనిష్టు నాయకుల కంటే తాను ఎక్కువ పుస్తకాలు చదివానని,తమ స్వార్థం కోసం శ్రామికులను వాడుకునే కమ్యూనిష్టులకు నేను బద్ధ విరొధిని ...వారితో చేతులు కలిపే ప్రశ్నే లేదు.మార్క్సిజం కంటే బౌద్ధ ధర్మమె వెయ్యి రెట్లు మెరుగైనదని వారు పేర్కొన్నారు.
( నేడు దారి తప్పిన సోదరులు దళితుల ముసుగులో, అంబేద్కర్ సంఘాల ముసుగులో, ఎస్ సి లను మభ్యపెట్టి, కమ్యూనిజానికి, నక్సలిజానికి,క్రైస్తవానికి, రజాకార్ల కు,కులాలకు దగ్గరగా ఎస్ సి లను లాక్కుని పోయే ప్రయత్నం చేస్తున్నారు.ఎస్ సి , ఎస్ టి , బి సి , దళితులు ఐక్యం కావాలంటూ వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, చర్యలు చివరికి ఎస్ సి, ఎస్ టి లకే ప్రమాదం వాటిల్లుతున్నడని అందరు గుర్తించే రోజు దగ్గర్లోనే వుంది..)
- అప్పాల ప్రసాద్.
అంబేద్కర్ చెప్పినవివి... అక్షరాల సత్యం ...ఆచరిస్తే నే ప్రగతి సాధ్యం
ReplyDelete