మాదిగ అయితేనేమి, మాల అయితేనేమి జ్ఞానసంపద లో మమ్మల్ని మించిన వారెవ్వరున్నారని సవాల్ విసిరిన వారిలో ఒకరు టి వి నారాయణ, మరొకరు బోయి భీమన్న.బోయి భీమన్న గారు ఇప్పుడు లేరు.మిగిలింది 93 ఏళ్ళ జ్ఞాన, వయో వృద్ధులు టి వి నారాయణ గారు మాత్రమే..
" నేనొక ధూళి కణాన్ని.స్వయం కృషి తో జీవితాన్ని విమలంగా చేసే ప్రయత్నం చేశాను.ఎవరి మనస్సునూ ఎప్పుడూ నొప్పించలేదు..బాధితుల్ని,పీడితుల్ని,దుఖితుల్ని, శక్తి కొలది ఆసుకునే ప్రయత్నం చేశాను.ఎంతో మంది విద్యార్థుల అభివృద్ధికి పాటుపడ్డాను.నా ప్రయత్నాల సాఫల్యతకు ఈ నా శిష్యులే తార్కాణం." అంటూ పద్మశ్రీ అవార్డ్ ప్రకటింపబడిన శ్రీ టి వి నారాయణ గారి నోటి నుండి వెలువడిన నిరాడంబర అక్షర సత్యాల పలుకులివి.
టి వి నారాయణ గారు వ్రాసిన పుస్తకాల జాబితా చూస్తే 50 వరకు వుంటాయి.అందులో కొన్ని ఆత్మదర్శనం,అమర వాక్సుధా స్రవంతి,మహనీయుల మహితోక్తులు,శ్రుతిసారం,ఆర్యపుత్ర శతకం ,భవ్యచరిత శతకం,జీవన వేదం,పది ఉపనిషనిత్తుల పై వ్యాఖ్యానం, ది సౌండ్స్ ఆఫ్ టైం అను ఆంగ్ల కవితా సంపుటి తదితర గ్రంథాలెన్నో రచించి జాతీయ ,ఆధ్యాత్మిక భావాల ప్రచార వ్యాప్తికి కృషి చేసిన మహానుభావుడు శ్రీ టి వి నారాయణ గారు.
25 ఏళ్ళ క్రితమే ప్రభుత్వం గుర్తించాల్సి వుండేది..కాని ఇప్పటికైన వీరి సేవలకు తగు రీతిలో పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరానికి ప్రకటించడం మన తెలుగువారందరికీ, మాదిగ వంశం లో పుట్టి బ్రాహ్మణులతో దీటుగా జ్ఞాన సంపాదనలో పోటీ పడి,సాధన చేసి తన వినమ్రతతో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఆయనను గౌరవించుకోవటం మనందరికీ గర్వకారణం.
ఫిబ్రవరి 29 న భాగ్యనగర్ లో శ్రీ టి వి నారాయణ గారికి జరిగిన సన్మానం మధుర స్మృతులలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు..
25 ఏళ్ళ క్రితమే ప్రభుత్వం గుర్తించాల్సి వుండేది..కాని ఇప్పటికైన వీరి సేవలకు తగు రీతిలో పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరానికి ప్రకటించడం మన తెలుగువారందరికీ, మాదిగ వంశం లో పుట్టి బ్రాహ్మణులతో దీటుగా జ్ఞాన సంపాదనలో పోటీ పడి,సాధన చేసి తన వినమ్రతతో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఆయనను గౌరవించుకోవటం మనందరికీ గర్వకారణం. ఫిబ్రవరి 29 న భాగ్యనగర్ లో శ్రీ టి వి నారాయణ గారికి జరిగిన సన్మానం మధుర స్మృతులలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు..
ReplyDelete