Friday, September 25, 2015

యోగ వెనక వున్న చరిత్ర అంతా ఇంతా కాదు.చదివితే ఒళ్ళు పులకరిస్తుంది.


 ఐక్య రాజ్య సమితి జూన్ 21 ని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించటంలో ప్రధాని నరేంద్ర మోడి ప్రధాన పాత్ర పొషించినప్పటికినీ యోగ విస్తరణలో ఎందరో మహానుభావులు వేల సంవత్సరాలుగా చేసిన కృషి మరువలేనిది
సాక్షాత్తూ పరమేశ్వరుడు యోగ కి ఆది పురుషుడు.ఆ కాల కంఠుడి నుండి సప్తర్షులు యోగ ని గ్రహించి,జన్మించిన ప్రతి మనిషి వ్యక్తి నుండి సమష్టి వైపు ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రపంచానికి పరిచయం చేసారు.మన భారత దేశంలో హిమాలయాలు కేంద్రంగా వందలాది సాధు సంతులు యోగ ను సాధన చేసారు.చేస్తున్నారు..5000 సంవత్సారాల క్రితం పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు నేపాల్,భూటాన్, తదితర దేశాల్లోకి విస్తరించింది.మానవుడికి,ప్రకృతికి మధ్య సామరస్యత చేకూరడానికి యోగ ప్రధానమైనది.సింధూ నాగరికత లో యోగ ప్రచారం లో వుందని శాస్త్రజ్ఞులు గ్రహించారు. దీని వేదాంతం సాంఖ్యం లో వుంది. ఈ సృష్టిలో పురుషుడికి,ప్రకృతికి మధ్య సంబంధాన్ని ఇది తెలియచేస్తుంది.వైదిక యుగంలో,బుద్ధుని,జైనముని కాలం లో యోగ ప్రాచుర్యం పొందింది.ఉపనిషత్తుల్లో నాలుగు రకాలైన యోగ వివరించారు.మంత్రం,లయ,హఠ,రాజ యోగాల ద్వారా అష్టాంగ యోగం, పవిత్ర మంత్ర శబ్ధాల ద్వారా,అంతర్గత శక్తిని వెలికితీయటం కోసం ప్రయత్నమే యోగము.
2వ శతాబ్దాములొ పతంజలి సూత్రాలు వ్రాయబడ్డాయి.తైత్తిరీయ ఉపనిషత్తు ప్రకారం మానవుడికి 5 రకాల దశలు వుంటాయి.ఒక్కొక్క దశను యోగ ద్వారా చేరవచ్చునని తెలుస్తుంది.అన్నమయ కోశం,ప్రాణ మయ,మనోమయ,విజ్ఞాన మయ,ఆనంద మయ కోశములు ఒకదానికొకటి పూరకంగా ఆనందమయాన్ని చేరుకోవాలి.యోగ లొ మొదటిది...ఏ పనులు చెయకూడదు,ఏ ఏ పనులు తప్పకుండా చేయాలో తెలపబడింది.ఆసనాలు 100 పైగా నేర్పబడినవి.ప్రాణాయామం,ప్రత్యాహరం ద్వారా సంయమనం, ధారణ ద్వారా ఏకాగ్రత, ధ్యానం ద్వారా ప్రశాంతతను,చివరకు సమాధి ద్వారా ఆనందమయం కావటం యోగ యొక్క అంతిమ లక్ష్యం.అది కైవల్యపదం.
మన ప్రాచీన యోగ ని ప్రపంచానికి తెలియచెప్పడానికి ప్రభుత్వాలు,వివిధ సంస్థలు, వ్యక్తులు శ్రద్ధ చూపించాయి.చూపించారు.
ఆది శంకరాచార్య ఉపన్సిషత్తులను,యోగ ను 8వ శతాబ్దములో ప్రాచుర్యంలోకి తెచ్చారు.
గోరక్ష నాథ్ అదే సమయం లో హఠ యోగాని తీసుకుని వచ్చారు.
18 వ శతాబ్దంలో స్వామి వివేకానంద పాశ్చాత్య ప్రపంచానికి రాజ యోగాన్ని రుచి చూపించారు.
వర్ల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యోగను ఒక ఆరోగ్య రక్షణగా గుర్తించింది.దానిలో వున్న శాస్త్రీయ విషయాలను సేకరించి,పొందుపరిచి,ప్రత్యేక్ యోగ శిక్షణకు ప్రపంచమంతటా బాట వేసింది.నిధులు ఇచ్చి ప్రొత్సహించింది.
వ్యక్తిగత జీవితంలో భాగమైంది భారత దేశంలో.
అయితే 18 వ శతాబ్దంలో ప్రాధాన్యత పొందిన యోగం మరుగున పడి,మళ్ళీ 20 వ శతాబ్దంలో జీవం పోసుకుంది.1920 లో స్వామి యోగానంద క్రియా యోగాన్ని,కుండలినీ యోగని నేర్పాడు.స్వామి శివానంద,స్వామి రామ,స్వామి సత్ చితానంద్,స్వామి కువలయానంద్,శ్రీ యోగేంద్రజి...ఇలా ఎందరో మహానుభావులు యోగకు ఉన్నత స్థానం కల్పించటంలో శ్రమించారు.20 వ శతాబ్దానికి చెందిన స్వామి క్రిష్ణమాచార్య,మైసూరు రాజాకి యోగ నేర్పిస్తూ మొదటి సారిగా హఠ యోగాన్ని ప్రజల సమక్షములో ప్రదర్శించాడు.అలాగే బి కె ఎస్ అయ్యంగారు,పత్తిభా జాయెస్,ఆయన కుమారుడు దేశికాచార్య ఈ ముగ్గురూ యోగ ను ప్రచారం చేసారు.1925లో అయ్యంగారి గారి యోగ పుస్తకాలు 17 భాషల్లో అనువదించబడ్డాయి.
ఈ రోజుల్లోనైతే శ్రీ రవిశంకర్ గురూజి,స్వామి నిరంజన్,స్వామి రాందేవ్ బాబా,శ్రీ జగ్గీ వాసుదేవ్ మొదలైన మహానుభావులు ప్రపంచమంతా మతాలకతీతంగా యోగను అందరికీ ప్రసాదిస్తున్నారు. అలాగె ఎన్నో పరిశోధన సంస్థలు,ముఖ్యంగా వివెకానంద యోగ కేంద్ర ద్వారా బెంగళూర్ లో శ్రీ నాగెంద్ర గారి వద్ద వేలది మంది యోగ ఒక పాఠ్యాంశంగా నేర్పిస్తున్నారు.
- అప్పాల ప్రసాద్ .

1 comment:

  1. యోగ వెనక వున్న చరిత్ర అంతా ఇంతా కాదు.చదివితే ఒళ్ళు పులకరిస్తుంది.

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers