Thursday, January 8, 2015

ఇది అందె గ్రామ (మెదక్ జిల్లా) సంకల్పం


బిసిలు , ఎస్ సి ల మధ్య గత సంవత్సరం కొట్లాటలు..

ఈ రోజు కలిసి నడిచి సామరస్యత ను చాటి చెప్పారు.

రెండు సంవత్సరాల క్రితం రావణాసురుణి బొమ్మను కాలిస్తే,మేము రాముని బొమ్మను కాలుస్తామంటూ కులాల మధ్య,యువకుల మధ్య చిచ్చు పెట్టారు.. తరతరాలుగా వున్న స్నేహాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేశారు..కాని ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది.మమ్మల్ని ఎవరూ విడదీయలేరని అన్ని కులాల ప్రజలు గట్టి జవాబు చెప్పారు.

ఇది అందె గ్రామ (మెదక్ జిల్లా) సంకల్పం.. జనవరి 6 న మంగళవారం ఉదయం 9.30 గంటలకు వూరి ప్రజలు కులం తో సంబంధం లేకుండా మాల మాదిగ బస్తీలతో పాటు అన్ని వీధుల్లో అందరూ కలిసి నడిచారు..మొదటి సారిగా దళిత మహిళలు హారతులు తీసుకుని హనుమాన్ దేవాలయం లో ప్రవేశించారు.

అనుమానాలు లేవు,మనస్పర్థలు లేవు,దూషణలు లేవు..సామరస్యత,సద్భావం కనిపించంది..శ్రీ కమలానంద భారతీ స్వామిజీ ఉదయం మాల కులపు పెద్ద మాట్ల లింగం ఇంట్లో ప్రవేశించారు.ఇల్లు కడిగి,తోరణాలు కట్టి,అందరు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామిజిని ఆహ్వానించారు.తమ చేతులతో వండిన అల్పాహారాన్ని వండి పెట్టారు.

డప్పుల మ్రోతలతో పాదయాత్ర సాగింది.

సామాజిక సమరసతా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అందరిని పులకరింపచేసింది పాదయాత్ర తరువాత గ్రామపంచాయితి వద్ద ప్రజలను ఉద్దేశించి శ్రీ కమలానంద భారతీ స్వామిజీ ప్రసంగించారు..మన సంప్రదాయాలు,సంస్కృతుల విశిష్టతను వివరించారు.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers