విద్యాలయాలు అనగానే గొడవలు,కులాల కుమ్ములాటలు,రెచ్చగొట్టే ప్రసంగాలు,విద్యార్థులను ఇంకొక కులం గల విద్యార్థులపై ఎగదోసే ప్రొఫెసర్ల తతంగాలు..జ్ఞానార్జన తక్కువ..సిద్ధాంతాల పిడివాదం ఎక్కువ. కాని ఈ విశ్వవిద్యాలయం లో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ అంశాలపై సెమినార్లు జరుపుతూ సామరస్యత నిర్మాణానికి ప్రయత్నం జరుగుతున్నది.గత నెల డిసంబర్ 6 అంబెద్కర్ ని అడ్డుపెట్టుకుని సమాజం లో విషం చిమ్మె ప్రయత్నం జరిగింది..కాని ఈ జనవరి 5 న అందుకు భిన్నంగా సామరస్యత, సద్బావనల గురించి ప్రసంగాలు జరగటం సంతోషకరమైన విషయం.
పాలమూర్ యూనివర్సిటీ ఆడిటోరియం లో జనవరి 5 సోమవారం జరిగిన కార్యక్రమం 300 పైగ విద్యార్థులు పాల్గొన్నారు.స్వామి వివేకానంద జయంతి ని పురస్కరించుకుని వివేకానంద మరియు డా.భీమ్రావ్ అంబేద్కర్ ల మధ్య భావసారూప్యత మీద ప్రసంగం జరిగింది.
యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ శివరాజ్ గారు,ప్రొఫెసర్ శ్రీమతి వనజ గారు, శ్రీనాథాచార్య,చంద్రకిరణ్ మొదలైన ఉపన్యాసకులు ప్రసంగించారు. అరుణ్,నవీన్,రాఖీ ఇంకా తదితర విద్యార్థులు కలిసి నిర్వహించారు..వీరిని రిజిస్ట్రార్ మరియు ఫ్యాకల్టీ అభినందించారు.
0 comments:
Post a Comment