Saturday, December 13, 2014

హిందూ మతం లో పుట్టాను..కాని హిందూ మతం లో మాత్రం చావను అని 1935 అక్టోబర్ ,యెవొలా లో డా.అంబెద్కర్ చేసిన ప్రకటన దేశంలో ప్రకంపనలు సృష్టించింది


' హిందూ మతం లో పుట్టాను..కాని హిందూ మతం లో మాత్రం చావను ' అని 1935 అక్టోబర్ ,యెవొలా లో డా.అంబెద్కర్ చేసిన ప్రకటన దేశంలో ప్రకంపనలు సృష్టించింది. చెరువులో నీళ్ళు తీసుకోనివ్వరు..చదువుకోనివ్వరు..శుభ్రమైన బట్టలు తొడుక్కోనివ్వరు..లోహంతో చేసిన పాత్రలు వాడనివ్వరు..ఆహారమివ్వరు..ఆశ్రయమివ్వరు.అంటూ తీవ్రమైన దుఖావేశంలో ఒక గదిలో రెండు రోజుల పాటు ఆహారం లేకుండా వెక్కి ఏడ్చాడు డా.అంబేద్కర్.ఎంతగానో ఆశించినా,శ్రమించినా సవర్ణులకు చీమ కుట్టినట్లు లేకపొవటం తో చివరకు ఈ ప్రకటన చేస్తేనైనా మార్పు వస్తుందరి ఒక ఝలక్ ఇచ్చాడు హిందూ సమాజానికి.కాని ఫలితం లేదు..అంతేగాదు...18 సంవత్సరాలు ఒపికతో ఎదురుచూశాడు.

ఈ లోపున నిజాం నవాబ్ తన మనుషులను పంపించి ఇస్లాం స్వీకరించవలసిందిగా నచ్చచెప్పాడు.డబ్బు ఆశ చూపించబోయాడు..అంతేనా? ఆంగ్లేయులు రంగం లోకి దూకారు..క్రైస్తవ మతంలో చేరమని పదవులు ఆశ చూపించారు..కమ్యూనిష్టులు వల వేసి దేవుడు లేదు,మతం లేదు,ధర్మం లేదు..కూడు గుడ్డ కావాలంటే తమ కమ్యూనిజంలో చేరమని వాదించారు.

ఆశ్చర్యం...ఆ మూడూ విదేశీ గడ్డ నుండి వచ్చిన సిద్ధాంతాలని,వాటివల్ల తన దళితులకు వచ్చే ప్రయోజనం ఏదీ లేకపోగా నిరంతరం భయం,భయంతో, నిత్యం సంఘర్షణలతో జీవించవలసివుంటుందని భావించారు..అందుకే వాటిని నిర్ధ్వంధంగా తిరస్కరించారు.

ఒక సందర్భంలో సిక్కుమతాన్ని స్వీకరిద్దామనుకున్నారు..

1956 మే లో చివరకు బౌద్ధమత దీక్ష తీసుకుని భారతదేశ మూల సూత్రాలైన సమత,కరుణ,ప్రజ్ణ,సుఖప్రదమైన ఉత్తమ జీవితం మనిషికి అవసరమని భావించి అవి బౌద్ధంలో లభిస్తాయని తెలుసుకున్నాడు. బి.బి.సి లొ మాట్లాడుతూ మార్క్సిజానికి, కమ్యూనిజానికి పరిపూర్ణమైన జవాబు ఇవ్వగలది బౌద్ధం ఒకటేనని,పేదరికాన్ని సాకుగా చూపించి రక్తపాతం సృష్టించవద్దని,మానవ స్వేచ్చకు ప్రాధాన్యతనిచ్చే బౌద్ధం మానవ వికాసానికి ఆధారం అవుతుందనీ' నిర్మోహమాటంగా వివరించాడు.

1 comment:

  1. బౌద్దంలో కూడ దేవుడు లేడనే సిద్దాంతాన్ని నమ్మి చేరాడు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers