Saturday, December 13, 2014

ఆర్థిక,సామాజిక రంగాల్లో ఎవరినైనా ఎదుర్కొని పేద ప్రజల ఋణం తీర్చుకోవడానికి తన జ్ఞానాన్ని,శరీరాన్ని సమర్పించిన త్యాగశీలి డా.అంబేద్కర్.


అంబేద్కర్ ఆశయ సాధనలో నడుద్దామని భావించే వారికి ఒక విన్నపం..ఆయనను పూర్తిగా చదివిన తరువాతే అడుగు ముందుకు వేయండి..ఆయనను,ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ప్రజలకు చెప్పండి.ఆయన తన జీవితంలో కష్టపడ్డ తీరులో ఒక వంతు భాగం మనం కష్టపడ్డా చాలు సమాజానికి మేలు చేసినట్లే.

డా అంబేద్కర్ కి విలాసాలకు,వినోదాలకు,సినిమాలకు,నాటకాలకు,విహార యాత్రలకు డబ్బులేదు.కొత్త బట్టలు లేవు.ఎంత దూరమైనా నడిచి వెళ్ళే వాడు..డా.అంబేద్కర్ చిన్నప్పుడు పశువుల పాకలో కిరోసిన్ దీపం బుడ్డి క్రింద చదువుకుని మెట్రిక్యులేషన్ లో ప్రథమ శ్రేణి లో పాసయ్యాడు.ఇంటర్,బి.ఏ.పూర్తి చేశాడు.ఈ చదువుకు కూడా బరోడా మహరాజు ని కలిసి నెలకు 25 రూపాయల ఉపకార వేతనం తో చదువుకున్నాడు.

ఉన్నత విద్య కోసం అమెరికా కొలంబియా యూనివర్సిటీ లో చేరడానికి బరోడా మహరాజు సహాయంతో 1913 లో న్యూయార్క్ వెళ్ళాడు.

అక్కడి విలాసాలకు మనసు చలించినప్పటికినీ,తన ఉపకార వేతనం లో కొంత ఇంటికి పంపించాల్సి వుంటుంది కాబట్టి,పొదుపు చేస్తూ కష్టపడి చదువుకున్నాడు. రోజుకు 18 గంటలు చదివాడు.

1915 లో ప్రాచీన భారత దేశ వాణిజ్యం అనే పరిశోధనాత్మక వ్యాసానికి డాక్టరేట్ లబించింది.

1916 లో భారత దేశం లో కులాలు - పుట్టు పూర్వొత్తరాలు అనె వ్యాసం సమర్పించి, మనువుకు ముందే కులాలు వున్నయని తెలిపాడు.

1916 లో భార దేశ జాతీయాదాయం-చారిత్రిక,విశ్లేషణాత్మక అధ్యయనం అనే సిద్ధాంత గ్రంథాన్ని కొలంబియా యూనివర్సిటీ అమోదించింది.డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాను అందించారు.ఈ గ్రంథాన్ని బరోడా మహరాజుకు అంకితమిచ్చారు. అంబేద్కర్ యొక్క ఆచార్యుడు ఎడ్విన్ సెలిగ్మాన్ ఈ గ్రంథం గురించి చెపుతూ..ఇంత లోతైన అధ్యయనం ఇప్పటివరకు చూడలేదని వ్యాఖ్యానించాడు.

న్యూయార్క్ లో 2 వేల పుస్తకాలు కొన్నాడు.

డా.అంబెద్కర్ ని అమెరికాలో బాగా ఆకర్శించినవి రెండు. ఒకటి అమెరికా రాజ్యాంగం.రెండవది నీగ్రోలను విద్యావంతులగా చేయడానికి ఉద్యమించిన బూకర్ టి వాషింగ్టన్ జీవితం.

అమెరికా తరువాత లండన్ కి వెళ్ళి,1916 లో ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు.ఆ తరువాత భారత్ కి వచ్చి,తిరిగి 1920 లండన్ చేరాడు.

లండన్ మ్యూజియం లో అధ్యయనం చేసిన సావర్కర్,మార్క్స్,లెనిన్,మాజినీ వంటి మేధావుల మాదిరిగానే ఆ లైబ్రరీ లో చదువు కొనసాగించాడు.

ఉదయం ఒక రొట్టెముక్క,ఒక చేప ముక్క తిని,టీ త్రాగి మ్యూజియం చేరుకుని,మధ్యహ్నం భోజనం కూడా చేయకుండా సాయంత్రం వరకు చదువు కొనసాగించిన నిరంతర అధ్యయన శీలి.కాపలాదారుడు కేకవేసేంత వరకు అక్కడే వుండి,వచ్చేటప్పుడు నోట్స్ వ్రాసుకున్న చిట్టీలను జేబులో నింపుకుని వచ్చేవాడు .

1921 లో ఆయన వ్రాసిన బ్రిటిష్ ఇండియాలొ సామ్రాజ్యపు రాబడి అనే వ్యాసనికి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా లభించింది.

ఇవన్నీ ఎందుకోసం చదివాడు? ఆర్థిక,సామాజిక రంగాల్లో ఎవరినైనా ఎదుర్కొని పేద ప్రజల ఋణం తీర్చుకోవడానికి తన జ్ఞానాన్ని,శరీరాన్ని సమర్పించిన త్యాగశీలి డా.అంబేద్కర్.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers