Saturday, June 17, 2017

Ramayanam-విశ్వమంతా శాంతి సద్భావనలతో జీవించాలని తన నడత తో సందేశం ఇచ్చిన మహానుభావుడు శ్రీ రాముడు


పుట్టటం,తినటం, సంతానం కనటం,భోగాలు అనుభవించటం ...ఇవన్నీ పశువులుకూడా చేస్తాయి. దీనికి భిన్నంగా మానవుడు తన సుఖమే కాకుండా, ప్రపంచ సంక్షేమం కోసం బ్రతకాలని తన జీవితం ద్వారా ఉదాహరణగా నిలిచిన రాముని గుణాలు మనం అలవరచుకోవలె. వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకొని, ఆదర్శ కుటుంబాన్ని నడిపి, సమాజంలోని ప్రజలు ఒకరినొకరు తరతమ భేదాలు లేకుండా నడుచుకోవాలని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని , విశ్వమంతా శాంతి సద్భావనలతో జీవించాలని తన నడత తో సందేశం ఇచ్చిన మహానుభావుడు శ్రీ రాముడు. ప్రకృతి లోని అన్ని జంతువులను చంపి, వాటి మాంసాన్ని ఎలా తిని ఎంజాయ్ చేయాలో, అమెరికా, చైనాలను ఉదహరించి ప్రజలను పక్కా భోగవాదులుగా తయారు చేసే కలెక్టర్లు నేడు దర్శనమిస్తారు. ఇతర కులాలను తిట్టి, కులతత్వ రాజ్యాలు ఎలా సాధించాలో చిన్నప్పటి నుండి పాఠాలు చెప్పే గురుకుల కార్యదర్శులు నేడు అగుపిస్తారు.అదే గురుకులాల్లో చదివిన రాక్షస కుల సంజాతుడు ప్రహ్లాదుడు లోక క్షేమం కృషి చేసే విద్య నేర్చాడు.

ఈ పరిస్థితి లో కుల,వర్గాలకతీతంగా personality development ని సాధించుకుని, భారతదేశంలో నే కాక ప్రపంచానికి నాయకత్వం వహించిన ఆదర్శమూర్తి శ్రీ రాముడు.
- Appala Prasad.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers