Saturday, June 17, 2017

Ramayanam-పాజిటివ్ గా అర్థం చేసుకుంటే రామాయణం అంతా అమృత తుల్యం


పాజిటివ్ గా అర్థం చేసుకుంటే రామాయణం అంతా అమృత తుల్యం. ( వివేకంతో, విశ్లేషిస్తే మనస్సు అద్దం వంటిదే)

నెగటివ్ గా చూస్తే అంతా విషవృక్షమే. (పచ్చని కళ్లద్దాల తో చూస్తే లోకమంతా పచ్చగా కనపడుతుంది. )

అంతుపట్టని త్రేతాయుగ ధర్మాలు, అధ్యయనం చేస్తే అర్థం అవుతుంది.

శ్రీ రాముడు ,శూద్ర స్త్రీ అరుంధతి చేతితో అన్నం తిన్నాడు.

అదే శూద్రుడైన శంభూకుని వధించాడు ?

లోక కల్యాణం కోసం జరిగే యజ్ఞాలను ఆపుతున్న రాక్షస స్త్రీ తాటకిని సంహరించాడు.

తనను అడవుల పాల్జేసిన స్త్రీ మూర్తులైన దాసి మంధర, తల్లీ కైక ల పట్ల ఉదారంతో వ్యవహరించాడు.

బ్రాహ్మణ వంశంలో పుట్టిన రావణుని హతమార్చాడు.

అదే వంశంలో పుట్టిన విభీషణుడిని చేరదీసాడు. లంక ను గెల్చి, విభీషణునికి అప్పగించాడే కాని రాముడు తానాక్రమించలేదు.సుగ్రీవుని భార్యను ఎత్తుకు పోయిన అన్న వాలిపై బాణం విసిరాడు. అయితే ఆ వాలి కొడుకైన అంగదుడిని యువరాజుని చేశాడు.

రావణునితోనే యుద్దానికి ముహూర్తం పెట్టించుకొని, సమరం సాగించాడు. రావణుని రథం కూలిపోతే, మరుసటిరోజు యుధ్ధానికి రమ్మన్నాడే కాని సంహరించలేదు . ఆ తరువాత చనిపోయిన రావణుడి చితికి విభీషణుడు అంత్యక్రియలు జరపక పోతే, నచ్చచెప్పి దహన సంస్కారాలు చేయిస్తాడు.

తండ్రి దశరథుడు చనిపోతే ఆఖరు రోజుల్లో చూడటానికైనా రాముడు, సీతమ్మను ఎత్తుకుపోతున్న రావణునితో పోరు సలిపి,చనిపోయిన జటాయువు ( పక్షి) శరీరానికి, తండ్రికిి మించిన అంత్యేష్ఠి కార్యక్రమాలు జరిపి ,కృతజ్ఞతలు చూపించాడు.

అడవులలో నివసించే నిషాద రాజు గుహుడిని స్నేహితుడిగా దగ్గరకు తీశాడు.గిరిజన పుత్రిక శబరి ఎంగిలి పండ్లు ఆరగించాడు. నాస్తికుడైన జాబాలి మంత్రి తో మంతనాలు జరిపాడు.

ఏక పత్నీవ్రతాన్ని అపహాస్యం చేసిన వక్రబుద్ధి శూర్పణఖ యొక్క ముక్కు,చెవులు కోయంచాడు.జీవితాంతం పరమ పునీత సీత ప్రేమ ను తప్ప, మరో స్త్రీ ని కామదృష్టితో కన్నెత్తి చూడకుండా మహిళ ల పట్ల సమాదరణ తో వ్యవహరించిన లోకోత్తర పురుషుడు శ్రీ రాముడు.
- Appala Prasad.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers