Tuesday, December 13, 2016

సిధ్దిపేట జిల్లా లో ఇంత దారుణమైన సంచార జాతుల బస్తీ వుందా?సిధ్దిపేట జిల్లా లో ఇంత దారుణమైన సంచార జాతుల బస్తీ వుందా?
సామాజిక సమరసత వేదిక సర్వే లో బయట పడ్డ చెప్పలేని నిజాలు..

30 ఏళ్ల క్రితమే వలస వచ్చి స్థిరపడి పోయిన 50 కుటుంబాలు దీన హీన మైన బ్రతుకులు గడుపుతున్నారు. పెంటయ్య అని ఒక పెద్దమనిషి ( ఈ ఫోటోలలో వున్నాడు) ఈ ప్రజల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి, ఎస్ టి కుల ధృవపత్రం తెప్పించాడు. అది మినహాయిస్తే వీరి బ్రతుకులలో వచ్చిన మార్పు ఏమీ లేదు. పూరిగుడిసెల్లో సంసారం, చెత్తా చెదారం మధ్య, మురికినీరు ప్రవహిస్తున్న చోట వంటలు, స్నానం చేయకుండానే రోజంతా తిరుగుళ్లు, ఫలితంగా చర్మవ్యాధులు ప్రబలి అనారోగ్యం తో బాధపడుతున్నారు. కడుపునొప్పులు, ఎసిడిటీలు, కీళ్లనొప్పులు, కంటివ్యాధులు మొదలైన రోగములు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ప్రైమరీ పాఠశాల కు వెళ్ళే 50 మందికి పైగా బాలబాలికలు స్నానము చేయకుండా బడికి వస్తారు. స్నానం కి ఇంటికి పంపిస్తే మళ్ళీ బడికి రారు. ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ, అమ్మవారికి బలులు ఇవ్వాలని , దానికోసం స్థోమత కి మించి 10,000 రూపాయలు అప్పు తెచ్చి ఖర్చులు చేయటం ఆనవాయితీ గా, మూఢనమ్మకం గా మారింది.
సామాజిక సమరసత వేదిక 15 మంది యువ విద్యార్థులతో డిసెంబరు 10 వ తేదీన సమగ్రంగా సర్వే జరిపించింది. దీని పూర్తి నివేదిక కొద్ది రోజుల్లోనే వస్తుంది. మాట్ల సుమన్ అధ్వర్యంలో సూకూరి శ్రీనివాస్, జక్కుల కరుణాకర్,సంతోష్, సతీష్, విశాల్, కాల్వ వినోద్, కనకయ్య, మాట్ల మహేశ్, జక్కుల కుమార్, అర్జున్, జక్కుల మహేశ్, యాదగిరి, చంద్రశేఖర్ మొదలైన వారు సర్వే చేశారు.
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వీళ్ళ వరకు ఎందుకు రావడం లేదు.? సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారి ఇలాఖా ఇది. ఈ దుస్థితి వారి వద్దకు వెళ్తే గాని అభివృద్ధికి నోచుకోదా? మద్యానికి బానిసలుగా, దురాచారాలకు బలిపశువులై బ్రతుకులీడుస్తున్న వీరి జీవితాల్లో వెలుగులు రావడానికి ఎంతకాలం పడుతుందో?
ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నడుము కట్టి వెనుక బడిన ఈ ప్రజల ప్రగతి కి కృషి చేయాలి.
- అప్పాల ప్రసాద్.

0 comments:

Post a Comment

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers