Tuesday, June 7, 2016

సమరసత లో అందరికంటే ఒక అడుగు ముందున్న మెట్ పల్లి గ్రామం







హిందువుల్లోని అన్ని కులాలకు ఒకటే శ్మశానం నిర్మించి,సమరసత లో అందరికంటే ఒక అడుగు ముందున్న మెట్ పల్లి గ్రామం.

కరీం నగర్ జిల్లా కేశవపట్నం మండలం లోని మెట్ పల్లి (చిన్న) గ్రామం లో అన్ని కులాల వారికి ఒకటే శ్మశానం.

శివుని రుద్రభూమిలోన అందరికీ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలు..రాష్ట్ర చరిత్రలో నే సాటి లేనిదిగా అందరినీ సమరస తో కలిపివుంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందీగ్రామం.

హిందూ సమాజం లో అస్పృశ్యత జాఢ్యం జడలు విప్పుతున్న వేళ, చాలా గ్రామాల మాదిరిగా..ఇంక ఒకింత ముందడుగు వేసి అధ్భుత ఆదర్శాన్ని చూపించారు.

హుస్నాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రి భూమయ్య , శ్రి తుమ్మల శ్రిరాం రెడ్డి ముఖ్యంగా ఈ దైవ కార్యాన్ని ముందు వుండి నడిపారు. కులభేదాలు, కుల రాజకీయాలతో ఆటలాడుకునే ఇటువంటి సమయం లో అందరికి ఒకేచోట అంత్ర్యక్రియ సంస్కారాలకు 20-30 గుంటల భూమిలో 20 లక్షలు ఖర్చు పెట్టి, చూస్తేనే శ్మశానం కాదు అది ఒక అందమైన పార్కులాగా ఏర్పాటు చేసారు.

ఒకే సారి ఇద్దరి అంత్యక్రియలు జరుపుకోవచ్చు.సాధారణంగా అంత్యక్రియల ఖర్చు 15 వేల రుపాయలు దాటి పోతున్న వేళ కేవలం అన్ని క్రియలు 5 వేలు ఖర్చు చేస్తె చాలు..తృప్తి తొ మరణించిన తమ వారి ఆత్మలకు సద్గతులు కలగటానికి చేసుకోవచ్చు ఇక్కడ.

దీని ఆలనా పాలనా అంతా సత్యం అని ఒక మెకానిక్ షాప్ నడిపే వ్యక్తి తో పాటు, రవి అలాగె ఎల్లారెడ్డి వంటి ఆత్మీయులు అందరూ ఈ కార్యక్రమాల నిర్వహణ చూస్తారు.

ఈ సంవత్సరం 2016 లో ఫిబ్రవరి లో ప్రారంబించిన ఈ శ్మశానం లో ఇద్దరు ఎస్ సి వర్గానికి చెందిన వారి తో పాటు మొత్తం 9మంది అంత్యక్రియలు ఇప్పటి వరకు (2016 జూన్) జరిగాయి..నీటికి ఇబ్బంది, స్నానాలకు, కట్టెలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు వున్నాయి.

అగ్రవర్ణాల ఆగడాలు ఎక్కువైయినాయి అని మైక్ కనపడితే చాలు మైకం తో గొంతుచించుకునే వారికి, అలాగే చేతివ్రెళ్ళు సమానమున్నాయా అంటూ అంటరానితనాన్ని సమర్థించే ఇతర కులాలవారికి, మెట్ పల్లి వారు చేసిన ఈ పని చెంప దెబ్బ వంటిది..గుణపాఠం కూడా..అన్ని గ్రామాల పెద్దలు , యువకులు కొట్లాటలు పెట్టే బదులు గౌరవంగా అందరినీ చూసే సమతాభావం నిర్మాణం చేయాలి.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. సమరసత లో అందరికంటే ఒక అడుగు ముందున్న మెట్ పల్లి గ్రామం

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers