Tuesday, June 7, 2016

సమరసతా శంఖమూదిన రామక్రిష్ణ పరమ హంస, నారాయణ గురు




నారాయణ గురు (1856-1928)

గీత కార్మికుల (ఎజువా) కులం లో జన్మించారు..సంస్కృతం, యోగ నేర్చుకున్నారు.ఎస్ సి వర్గాల విద్యార్థులందరికీ నేర్పించారు.

మరుద మలై కొండల్లో తపస్సు చేశారు.

ఆయుర్వేదం నేర్చుకుని బీద సాదలకు సేవ చేశారు.

ఎజువ కులస్థులు ఆ రోజుల్లో బ్రాహ్మణులకు 32 అడుగుల దూరం లో వుండి నడవాలని నియమాలు విధించారు.

దేవుడు సృష్టించని ఈ విభేదాలు ..మానవుడే తమ స్వార్థం కోసం ఇవన్ని కల్పించాడు.

నారాయన గురు తన ఆధ్యాత్మిక శక్తితో ఒక నది లో శివరాత్రి రోజున మునిగి శివలింగం తో పైకి వచ్చాడు. ఆ లింగాన్ని ఎజువా కులస్థుల బస్తిలో ప్రతిస్ఠాపించి పూజలుచేశారు.

కాలి కట్, కన్ననూర్, త్రివేండ్రం వంటి చోట్ల శూద్రులచే దేవాలయాలు నిర్మింప చేసిన మహాను భావులు.

గాంధిజి వచ్చి కలిసి ప్రేరణ పొందారు. డా అంబేద్కర్ మాట్లాడుతూ ఎందరో వచ్చారు ..ఎందరో వెళ్ళారు..అస్పృశ్యత మీద దుమ్ము లేపారు.కాని ఏమీ చేయలేక పోయారు.నారాయణ గురు మాత్రం విజయం సాధించారు..అని వ్యాఖ్యానించారు.


రామక్రిష్ణ పరమహంస

ఉపనయనం తరువాత తన మొదటి భిక్ష ను ఒక కుమ్మరి స్త్రీ ఇంట్లో స్వీకరించి సమరసతా విప్లవానికి ఆ రోజుల్లోనే శ్రీకారం చుట్టారు.

వివేకానందుని వంటి ఒక ప్రపంచ హిందూ సన్యాసిని తయారు చేసి ' తన శక్తినంతా వివేకునికి ధారపోసి నేను ఫకీరునయ్యాను ' అంటూ వినమ్ర సేవతో గడిపాడు.భక్తి వుంటే అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడవుతాడని చెప్పాడు.అన్ని కులాల వారిని శిష్యులుగా చేర్చుకున్నాడు.

అర్థరాత్రి ఎస్ సి వాడలకు వెళ్ళి అక్కడి మరుగుదొడ్లను తన పొడవాటి వెంట్రుకలతో శుభ్రం చేశాడు..వారి భార్య శారదా మాత అన్ని కులాలావారికి ఆదరణ తో భోజనం పెట్టి, తానే స్వయంగా విస్తర్లు తీసేది.

1 comment:

  1. సమరసతా శంఖమూదిన రామక్రిష్ణ పరమ హంస, నారాయణ గురు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers