Monday, April 11, 2016

డా.అంబేద్కర్ ఈ దేశాన్ని , ధర్మాన్ని ప్రేమించి

డా.అంబేద్కర్ ఈ దేశాన్ని , ధర్మాన్ని ప్రేమించి ఇది కలకాలం కల్మశం లేకుండా వుండాలని కోరుకున్న నిష్కలంక దేశభక్తుడు.తనకు జన్మనిచ్చిన హిందూ సంస్కృతి లో సామాజిక గౌరవంతో బ్రతికే అవకాశం కొసం నిరంతరం ఆవేదన చెంది దాని కోసం తపించి, పోరాటం చేసిన మహనీయుడు డా.అంబేద్కర్.హిందూ సమాజం లోని కుళ్ళుని కడిగివేయడానికి,మూఢ విశ్వాసాలను నిర్మూలించడానికి జీవితాంతం పాటుపడ్డారు.తక్కువ , ఎక్కువ కుల భేదాలు మరిచి అందరం కలిసి సమరసతతో జీవించాలని కలలు కన్నారు.అప్పుడే దేశం ప్రగతి చెందుతుందని విశ్వసించారు.

1891 ఏప్రిల్ 14 న మహరాష్ట్ర లోని రత్నగిరి లో అంబావాడ గ్రామం లో రాంజీ సక్పాల్-భీమాబాయి దంపతుల 14వ సంతానం డా అంబేద్కర్. పాఠశాలలో ఈ బాలున్ని అమితంగా ప్రేమించే అంబేద్కర్ అను పేరు గల బ్రాహ్మణ ఉపాధ్యాయుడు భీమ్రావ్ కి తన పేరు ఇవ్వటం తో అప్పటి నుండి అంబేద్కర్ గా ప్రపంచ ప్రసిద్ధి పొందాడు.( అందరికి తెలిసిన అంబేద్కర్ పేరులో ఒక బ్రాహ్మణుడి యోగదానం వుందన్నమాట. భీం రావ్ కూడా కులవివక్షత ను వ్యతిరేకించాడే కాని ఆ కులాల వారిని వ్యతిరెకించలేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.అయినా కూడా కమ్యూనిష్టులు,క్రైస్తవం పుచ్చుకుని ఎస్ సి లకు నాయకత్వతం వహించే నాయకులు, తమ దళిత సంఘాల మనుగడ కొసం ఆంప్లిఫైర్ లా అరవడమే తప్ప వివేకం లేని కొందరు నాయకులు, చదువుకుని కూడా, హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న కొందరు పత్రిక సంపాదకులు, రిటైర్డ్ ఐ ఏ ఎస్ , ఐ పి ఎస్ లు , విద్యావంతులు ఎస్ సి లను డా అంబేద్కర్ దారి నుండి తప్పించి మరింత గందరగోళానికి గురిచేస్తున్నారు)

అంబేద్కర్ తండ్రి,పినతండ్రి ఇద్దరు హిందూ సంస్కృతి పట్ల భక్తి కలిగిన వారు..పినతండ్రి సన్యాసం స్వీకరించారు.తండ్రి రాంజీ రామ భక్తుడు.రామాయణం, భారతం ,మహాపురుషుల చరిత్రలను వూరూరా ప్రచారం చేసేవారు.దైవధ్యానం లొ వుండే వారు.తాత తండ్రుల లక్షణాలను పుణికి పుచ్చుకున్న వాడిగా అంబేద్కర్ పేరు పొందాడు.వూర్లోని గ్రామ దేవతల విగ్రహాల పల్లకీని వీరి ఇంటనే వుంచేవారు.కబీర్, సంత్ జ్ఞానేశ్వర్, తుకారం కీర్తనలను పాడుతుండేవారు.ఆత్మవిశ్వాసం, సమయపాలన, జ్ఞాన సాధన లో వారు అంబేద్కర్ తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.అందుకే అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే,మనిషి కేవలం పందుల్లా పొట్ట మేపుకోవటం ఒక్కటే కాదు,మతం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని, మంచి గుణాలను పెంచుతుందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.( హిందుత్వాన్ని ఎడా పెడా తిట్టే మూర్ఖ విద్యావంతులు అంబేద్కర్ పూర్వీకుల, అంబేద్కర్ చరిత్ర ను చదవలేదనుకోవాలా?)

డా.అంబేద్కర్ ఈ దేశాన్ని , ధర్మాన్ని ప్రేమించి ఇది కలకాలం కల్మశం లేకుండా వుండాలని కోరుకున్న నిష్కలంక దేశభక్తుడు.తనకు జన్మనిచ్చిన హిందూ సంస్కృతి లో సామాజిక గౌరవంతో బ్రతికే అవకాశం కొసం నిరంతరం ఆవేదన చెంది దాని కోసం తపించి, పోరాటం చేసిన మహనీయుడు డా.అంబేద్కర్.హిందూ సమాజం లోని కుళ్ళుని కడిగివేయడానికి,మూఢ విశ్వాసాలను నిర్మూలించడానికి జీవితాంతం పాటుపడ్డారు.తక్కువ , ఎక్కువ కుల భేదాలు మరిచి అందరం కలిసి సమరసతతో జీవించాలని కలలు కన్నారు.అప్పుడే దేశం ప్రగతి చెందుతుందని విశ్వసించారు.

1891 ఏప్రిల్ 14 న మహరాష్ట్ర లోని రత్నగిరి లో అంబావాడ గ్రామం లో రాంజీ సక్పాల్-భీమాబాయి దంపతుల 14వ సంతానం డా అంబేద్కర్. పాఠశాలలో ఈ బాలున్ని అమితంగా ప్రేమించే అంబేద్కర్ అను పేరు గల బ్రాహ్మణ ఉపాధ్యాయుడు భీమ్రావ్ కి తన పేరు ఇవ్వటం తో అప్పటి నుండి అంబేద్కర్ గా ప్రపంచ ప్రసిద్ధి పొందాడు.( అందరికి తెలిసిన అంబేద్కర్ పేరులో ఒక బ్రాహ్మణుడి యోగదానం వుందన్నమాట. భీం రావ్ కూడా కులవివక్షత ను వ్యతిరేకించాడే కాని ఆ కులాల వారిని వ్యతిరెకించలేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.అయినా కూడా కమ్యూనిష్టులు,క్రైస్తవం పుచ్చుకుని ఎస్ సి లకు నాయకత్వతం వహించే నాయకులు, తమ దళిత సంఘాల మనుగడ కొసం ఆంప్లిఫైర్ లా అరవడమే తప్ప వివేకం లేని కొందరు నాయకులు, చదువుకుని కూడా, హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న కొందరు పత్రిక సంపాదకులు, రిటైర్డ్ ఐ ఏ ఎస్ , ఐ పి ఎస్ లు , విద్యావంతులు ఎస్ సి లను డా అంబేద్కర్ దారి నుండి తప్పించి మరింత గందరగోళానికి గురిచేస్తున్నారు)

అంబేద్కర్ తండ్రి,పినతండ్రి ఇద్దరు హిందూ సంస్కృతి పట్ల భక్తి కలిగిన వారు..పినతండ్రి సన్యాసం స్వీకరించారు.తండ్రి రాంజీ రామ భక్తుడు.రామాయణం, భారతం ,మహాపురుషుల చరిత్రలను వూరూరా ప్రచారం చేసేవారు.దైవధ్యానం లొ వుండే వారు.తాత తండ్రుల లక్షణాలను పుణికి పుచ్చుకున్న వాడిగా అంబేద్కర్ పేరు పొందాడు.వూర్లోని గ్రామ దేవతల విగ్రహాల పల్లకీని వీరి ఇంటనే వుంచేవారు.కబీర్, సంత్ జ్ఞానేశ్వర్, తుకారం కీర్తనలను పాడుతుండేవారు.ఆత్మవిశ్వాసం, సమయపాలన, జ్ఞాన సాధన లో వారు అంబేద్కర్ తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.అందుకే అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే,మనిషి కేవలం పందుల్లా పొట్ట మేపుకోవటం ఒక్కటే కాదు,మతం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని, మంచి గుణాలను పెంచుతుందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.( హిందుత్వాన్ని ఎడా పెడా తిట్టే మూర్ఖ విద్యావంతులు అంబేద్కర్ పూర్వీకుల, అంబేద్కర్ చరిత్ర ను చదవలేదనుకోవాలా?
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. డా.అంబేద్కర్ ఈ దేశాన్ని , ధర్మాన్ని ప్రేమించి ఇది కలకాలం కల్మశం లేకుండా వుండాలని కోరుకున్న నిష్కలంక దేశభక్తుడు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers