Monday, April 11, 2016

ఇద్దరు భార్యలు. సహధర్మచారిణులు


బరోడా మహరాజ్ , కోల్ హాపూర్ మహరాజుల సహకారం తో ఉన్నత చదువులు చదివి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసి దేశాని కి పేరు తెచ్చి, తనకు సహాయం చేసిన వారి ఋణాన్ని దేశాని కి సేవ చేస్తూ తీర్చుకున్న వినమ్ర , వినయ వంతుడు డా. అంబేద్కర్.( ప్రజల పన్నులతో, ప్రభుత్వ సబ్సిడీలతో విద్యనభ్యసిస్తూ యూనివర్సిటీలలో దేశానికి వ్యతిరేకంగా పనిచేసే నేటి కొందరు విద్యార్తులు, వారిని తప్పుదారి పట్టించే ప్రొఫెసర్లను మనం చూస్తూనే వున్నాం ఈ రోజుల్లో )

సంస్కృతం అధ్యయనం చేసారు.ఆర్యులు బయట నుండి వచ్చి ఇక్కడి దళితులను, దస్యులను, మూలవాసులను తరిమికొట్టారంటూ ఇప్పటికీ కొనసాగుతున్న తప్పుడు చరిత్రను డా అంబేద్కర్ అప్పుడే అబద్ధమని నిరూపించారు. ఆర్య అనే శబ్దం ఒక జాతికి, ఒక వర్గాని సంబంధించినది కాదని, వేదం లో ఆర్య అనే శబ్దం 33 సార్లు వచ్చిందనీ, అది గుణవాచకమని అంటే శ్రేష్టుడని అర్థమని డా.అంబేద్కర్ వివరించారు. సంస్కృతం చదివినందువల్ల డా.అంబేద్కర్ నిజం గుర్తించారు.అంతేఅ కాదు ఎస్ సి వర్గాల వారికి 3 సూత్రాలు పాటించమన్నారు. 1.చదువు..2.ఐక్యంగ వుండు...3 పోరాడు అంటూ సుద్దులు చెప్పారు.ఎందుకంటే తాను బాగా లోతుగా చదివాడు కాబట్టే నిజానిజాలు తెలుసుకున్నాడు.( ఈ రోజు అంబేద్కర్ పేరుతో పని చేసె కొన్ని దళిత సంఘాలు సంస్కృతాన్ని ద్వేషిస్తున్నాయి..అంబేద్కర్ పేరు కి ముందు శ్రీ అని పెడితే ఒక మూర్ఖుడు అంటాడు కదా "అంబేద్కర్ ని సంస్కృతీకరిస్తున్నారని అవేశం తో రగిలిపోయాడు..చదువుకొరా బాబూ అంటే ఆంధ్రజ్యోతి లో వచ్చే కంచ ఐలయ్య,డా హరగోపాల్ వ్యాసాలు తప్ప, కాకి మాధవరావ్ సెమినార్ ఉపాన్యాసాలు తప్ప,హిందుత్వాన్ని తిట్టే కథలే తప్ప మరేమి చదువు రాని అజ్ఞానులకు డా అంబేద్కర్ అంతరంగిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం ఈ జన్మలో సాధ్యం కాదు.అన్ని కులాలతో ఐక్యంగా వుండమంటే,కులపిచ్చి తో ఒక కులాన్ని రెచ్చగొట్టి కలపటం తప్ప ఇంకో పని చేయరు.సామజిక అసమానతలను దూరం చేసి వ్యవస్తలను మార్చాలని అంబేద్కర్ చెప్తే...మైకుల్లో ఇతర కులాలను పచ్చి బూతులు తిట్టి,కొట్లాటలకు ఉసిగొల్పే ఈ సూడో దళితనాయకులకు అంబేద్కర్ నిజంగా అర్థమయ్యాడంటే అనుమానమే?) కొలంబియా లో పి హెచ్ డి,లండన్ లో ఎం ఎస్ సి,డి ఎస్ సి, బార్ ఎట్ లా పట్టాలు,జర్మనీ లో రెండు సార్లు పట్టాలు డాక్టరేట్లు పొందిన డా..అంబేద్కర్ వాణిజ్య శాస్త్రం లో, రూపాయి సమస్య మీద వ్యాసాలు వ్రాసి ప్రపంచ ప్రసిద్ది పొందాడు.( కంచ ఐలయ్య నేను హిందువునెట్లయిత..మరికొంతమంది దళితులు హిందువులు కారు అని, దళితులే మూలవాసులంటూ చరిత్ర ను తప్పుదారి పట్టించే వ్యాసాలు వ్రాసి కులాల మధ్య చిచు పెట్టే ఈ ప్రొఫెసర్లకు అంబేద్కర్ కి వున్న దేశ సమగ్రతలో వెయ్యవ వంతు లేకపోగా దేశ విభజన లో అందె వేసిన వారిగ గుర్తింపు పొందారు)

డా.అంబేద్కర్ ఆర్థిక ఇబ్బందుల్లో వుంటే మొదటి భార్య పశువుల పేడ లు అమ్మి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పొషించింది.భర్తకు కూడా పంపింది.రెండవ భార్య డా.సవిత బ్రాహ్మణ కులం లో జన్మించినా భర్త అంతిమ కాలం లో ఆయనను సేవించడానికి వెనుకాడలేదు.హిందూ కుటుంబం లో ని స్త్రీ, భర్త పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహించినట్లే ఆమె నిర్వహించింది.మొదటి భార్య మరణించినప్పుడు హిందు ఆచారాల కనుగుణంగా గుండు కొట్టించుకున్నాడు.హిందూ ఆచారాలకు అనుగుణంగా అంత్యక్రియలు చేశాడు.

1927 లో మహద్ చెరువు సత్యాగ్రహ సమయం లో స్థానికంగా ఒక నాయకుడు అంబేద్కర్ కి ఉత్తరం వ్రాసి, బ్రాహ్మణులు తమ ఉద్యమం లో పాల్గొనకుండా చూడాలని,లేనట్లయితే తాము ఉద్యమానికి దూరంగా వుంటామని హెచ్చరించింప్పుడు అంబేద్కర్ తన వెంట తన ఉద్యమానికి బాసటగా నిలిచిన బ్రహమణులను కూడా వెంట తీసుకుని పోయి,తాను బ్రాహ్మనులను ద్వేషించే వాన్ని కాదని నిర్ద్వందంగా చెప్పిన నాయకుడు డా.అంబెద్కర్.( అంబేద్కర్ పేరు చెప్పుకుని బ్రహ్మణులను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళను తిట్టకుండా వ్యాసాలు , ఉపన్యాసాలు వుండవు. ఇదీ అంబేద్కర్ కి , ఈ సూడొ అంబేద్కరిస్టులకు వున్న తేడా.)
- అప్పాల ప్రసాద్.

1 comment:

 1. బరోడా మహరాజ్ , కోల్ హాపూర్ మహరాజుల సహకారం తో ఉన్నత చదువులు చదివి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసి దేశాని కి పేరు తెచ్చి, తనకు సహాయం చేసిన వారి ఋణాన్ని దేశాని కి సేవ చేస్తూ తీర్చుకున్న వినమ్ర , వినయ వంతుడు డా. అంబేద్కర్.( ప్రజల పన్నులతో, ప్రభుత్వ సబ్సిడీలతో విద్యనభ్యసిస్తూ యూనివర్సిటీలలో దేశానికి వ్యతిరేకంగా పనిచేసే నేటి కొందరు విద్యార్తులు, వారిని తప్పుదారి పట్టించే ప్రొఫెసర్లను మనం చూస్తూనే వున్నాం ఈ రోజుల్లో )


  ReplyDelete

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers