Tuesday, March 1, 2016

రాజ్ దీప్ సర్ దేశాయి అనే ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ తాను 'దేశ ద్రోహి ' గా చెప్పుకోవడానికే ఇష్టపడతానని ఒప్పేసుకున్నాడు

రాజ్ దీప్ సర్ దేశాయి అనే ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ తాను 'దేశ ద్రోహి ' గా చెప్పుకోవడానికే ఇష్టపడతానని ఒప్పేసుకున్నాడు.

తన జర్నలిస్ట్ జీవిత కాలం లో బహుశ ఒకే ఒక సత్యాన్ని నిర్భయంగా చెప్పిన సందర్భమిదే కావొచ్చును.

భారత దేశ సంస్కృతిని, ప్రధాని మోడిని తన అవాకు చెవాకులతో స్వదేశమా,విదేశమా అని చూడకుండా పరిహాసం చేసి,రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19 భావ వ్యక్తీకరణ స్వేచ్చ ను దేశ వ్యతి రేక స్వేచ్చగా భావించే జర్నలిస్ట్ ఈయనే.

ఈ రోజు (ఫిబ్రవరి 19) ఆంధ్రజ్యోతి లో భారతీయులను తప్పుదారి పట్టించే వ్యాసం వ్రాశాడు.

(ఆంధ్రజ్యోతి లో భారత్ కి వ్యతిరేకంగా , హిందువులకు వ్యతిరేకంగా వ్యాసాలు,లేఖలు,కరపత్రాలు వ్రాసి పంపితే, కుక్కకు మాంసపు బొక్క దొరికినట్టు సంబరపడి ప్రచురిస్తుంది.వచ్చిన వ్యాసం వల్ల కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బ తింటున్నాయని కూడా భావించడు ఎడిటర్ శ్రీనివాస్.)

జె ఎన్ యు లో భారత్ ని విచ్చిన్నం చేసే వరకు పోరాటం ఆగదు అంటూ కొందరు విద్యార్తులు చేసిన నినాదాలు ఈ జర్నలిశ్త్ కి అవి ప్రభుత్వ (మోడి కి) వ్యతిరేకమే తప్ప దేశానికి విరుద్ధం కాదని సర్టిఫికేట్ ఇచ్చేశాడు.

పాకిస్తాన్ జిందాబద్ అనీ,కాశ్మీర్ స్వాతంత్ర్యం లాగెసుకుంటాం అనీ చెసిన నినాదాలు ఖచ్చితంగా దేశద్రోహమే..అలా కాదని భావించాడు కాబట్టే తాను దేశద్రోహి నని ప్రకటించుకున్నాడు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో వియత్నాం పై అమెరిక జరిపిన దాడి పై నిరసన వ్యక్తం చేశారని చెప్తూ అక్కడ రాజద్రోహం నేరం మోపలేదని అంటాడీఅయన..

అయితే 1960 నుండి ఇప్పటి వరకు ఏ విస్వ విద్యాలయాల్లో వియత్నాం వీరుల గురించి జయంతులు, వర్ధంతులు,అలాగే అమెరిక దేశానికి వ్యతిరేకంగా ఎవరూ గొంతు విప్పలేదని రాజ్ దీప్ కి తెలియదా?

అంతే కాదు బిన్ లాడెన్ అమెరికా పై దాడి చేసి వేలాది ప్రజలను హతమర్చినప్పుడు,అక్కడి మీడియా ఒక్కటై,దేశానికి అండగా నిలిచింది..రాజ్ దీప్ లాగా అమరవీరులుగా భావించే అఫ్జల్ గురు,యాకూబ్ మెమెన్ ల కు మద్దతు పలకలేదు..బిన్ లాడెన్ ఫోటో లు పెట్టుకుని అమెరికా విశ్వ విద్యాలయాల్లో ఎవరూ ఊరేగలేదు.

అఫ్జల్ గురు కి మద్దతుగా నినాదాలు ఇవ్వటం రాజ్ దీప్ కి నచ్చక పొతే వెంటనే ఎందుకు వ్యాసాలు వ్రాయలెదు. ప్రభుత్వం ఒక విద్యార్థిని అరెస్ట్ చేయగానే ఎందుకు స్పందిస్తున్నట్లు? భిన్నమైన సిద్ధాంతాలు వుండటం వేరు అనేది,అందరికీ , రాజ్ దీప్ కి కూడా తెలుసు..అయితే భారతీయ్ జెండా పట్ల, జాతీయ గీతాల పట్ల,పార్ల మెంట్ పై దాడి చేసిన దాని పై అందరిది ఒకే అభిప్రాయం వుండటమే దేశభక్తి అనిపించుకుంటుంది..భిన్నమైన అభిప్రాయం వుంది కాబట్టే ' దేశద్రోహి అని ప్రకటించుకున్నావ్.

గమ్మత్తేమిటంటే రాజ్ దీప్ తాను హిందువుగా గర్వపడుతున్నాడట.హిందువుగా శ్రిఖండ్ అంటే,బీఫ్ అంటే ఇష్టంగా తింటాడట.తనలో బహుళ సంస్కృతులున్నాయట.హిందువు అంటే తినటం,త్రాగటం,పడుకోవటం, లేవటం, స్వంత హిందుధర్మాన్ని అవహేళన చేయటం గా భావించే రాజ్ దీప్ కి దేశం,హిందుత్వం పట్ల ఓనమాలు కూడా అర్థం కాలెదన్న మాట. రాజ్ దీప్ ని ఇంత మాట అనొచ్చునా?

ఆయనే చెప్పాడు తాను 1935 లో లండన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్నానని...అందుకే ఈ దేశం పట్ల అవగాహన లేదు కాబట్టే దేశ ద్రోహిగా గర్విస్తున్నాడు.. రవీంద్ర నాథ్ టాగొర్ వలె, వివెకానంద వలే,అబ్దుల్ కలాం వలే, సుభాస్ చంద్ర బోస్ వలే మన దేశంలోని మాతృభాషలో ప్రాథమిక పాఠాలు నేర్చి,ఇక్కడే పూర్తిగా చదివి వుంటే ఇంత ప్రతిష్టాపక దేశ ద్రోహి కాకపోయేది.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వ్యవస్థాపకుడు శ్రీ రాం నాథ్ గోయంకా జర్నలిజం లో గొప్ప విలువలను ఆచరించి చూపించాడు..ఆయనను చదివి, కావాలని వుంటే దేశభక్తుడివి కా..లేదా నీ ఇష్టం..చరిత్రలో నిలిచిపోయే దేశద్రోహిగా గర్వపడుతూ వుండిపో.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. రాజ్ దీప్ సర్ దేశాయి అనే ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ తాను 'దేశ ద్రోహి ' గా చెప్పుకోవడానికే ఇష్టపడతానని ఒప్పేసుకున్నాడు.


    తన జర్నలిస్ట్ జీవిత కాలం లో బహుశ ఒకే ఒక సత్యాన్ని నిర్భయంగా చెప్పిన సందర్భమిదే కావొచ్చును.


    భారత దేశ సంస్కృతిని, ప్రధాని మోడిని తన అవాకు చెవాకులతో స్వదేశమా,విదేశమా అని చూడకుండా పరిహాసం చేసి,రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19 భావ వ్యక్తీకరణ స్వేచ్చ ను దేశ వ్యతి రేక స్వేచ్చగా భావించే జర్నలిస్ట్ ఈయనే.


    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers