Tuesday, March 1, 2016

డా.అంబేద్కర్ లేక దళితులు నిజంగా అనాధలయ్యారు

డా.అంబేద్కర్ లేక దళితులు నిజంగా అనాధలయ్యారు.
దళిత కార్డ్ ఉపయోగించి,విద్వేషం నింపుతున్నారు.

అఫ్జల్ గురు,యాకూబ్ మెమెన్,మఖ్బూల్ భట్ లే ఉగ్రవాదులనుకుంటే, కమ్యూనిష్టులు ఇంకా తీవ్రవాదుల కంటే ప్రమాదకరంగా పరిణమించారు..పార్ల మెంట్ సభ్యుడు రాజా కూతురు అపరాజిత జె ఎన్ యు లో దేశవ్యతిరేక నినాదాలు చేయటమే ఒక ఉదాహరణ....

ఈ దేశం ఒక సమైక్య దేశంగా వుండటం వీళ్ళకు నచ్చదు..సర్దార్ వల్లభాయి పెటేల్ 500 పైగా సంస్థానాలను ఒక్క చొట చేర్చి, దేశాన్ని సమైక్యంగా వుంచితే, వాటిని స్వతంత్ర దేశాలుగా విడగొట్టడమే వీళ్ళ లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఆంధ్ర జ్యోతి పత్రిక ఎడిటర్ శ్రీనివాస్ మొదలుకుని విప్లవకవుల వరకు ఇది ఒక అవకాశంగా భావించి, రెచ్చగొట్టే వ్యాసాలతో,తప్పుదారి పట్టించే భావాలతో కుమ్మేస్తున్నారు.జిహాదిష్టులతో, క్రైస్తవ మిషనరీలతో, పాకిస్తాన్ తీవ్రవాదులతో చేతులు కలపడానికైనా వెనుకాడని ఈ దేశ ద్రోహుల వల్ల మన స్వాతంత్ర్యానికి ముప్పు వుందని, హింసొన్మాదులుగా వీళ్ళను చిత్రీకరించిన డా.అంబేద్కర్ ఎర్రజెండా నీడలొకి కూడా వెళ్ళకుండా దళితులను కాపాడాడు. అటువంటి మహనీయుడు కరువయ్యాడు కాబట్టే దళితులను ఎవడుపడితే వాడు రాబందుల్లా పీక్కుని తింటున్నారు..ఈ దేశద్రోహులు జరిపే కార్యకలాపాలకు డా అంబెద్కర్ ఫోటో పెట్టి,దేశద్రోహ నినాదాలు,విద్వేష వివాదాలు సృష్టిస్తున్నారు. దళితులను గందర గోళ పరుస్తున్నారు..డా.అంబెద్కర్ వ్రాసిన "థాట్స్ ఆన్ పాకిస్తాన్ " చదివితే జిహాదీలు వందల సంవత్సరాలుగా ఎలా ప్రజలను ఎలా హింసించారో చక్కగా వివరించారు.ఇప్పుడేమో దళితులను పాకిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లో పెట్టే పనిని కమ్యూనిష్ట్తులు చేపట్టారు.పాకిస్తాన్ ఏర్పడిన తరువాత ఆ దేశం లో 13 లక్షల దళితులను ఊచకోత కోయటమో,లేద మతం మార్చటమో చేసిన జిహాదిష్టుల కౌగిల్లోకి అలాగే క్రైస్తవ మిషనరీల ఉక్కు కౌగిట్లోకి భారత దేశ దళితులను నెట్టివేస్తున్న కంచ ఐలయ్య,కాకి మాధవ రావ్ ల కుట్ర ఇప్పటికే అర్థమయింది.

40 ఏళ్ళుగా దేశం లోని అన్ని రంగాల్లో జొరబడిన వీళ్ళు,ఇప్పుడిప్పుడే వీళ్ళ అసలు రహస్యం,బండారం బయట పడుతున్నది.వీళ్ళను దేశం ఎన్నటికీ క్షమించదు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. డా.అంబేద్కర్ లేక దళితులు నిజంగా అనాధలయ్యారు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers