Tuesday, March 1, 2016

దేశం లో వుంటూ రాజ్యాంగ నియమాలు ఆచరించక, వ్యతిరేకిస్తే దేశం ఇంకొక దేశానికి,బానిస అవుతుంది

దేశం లో వుంటూ రాజ్యాంగ నియమాలు ఆచరించక, వ్యతిరేకిస్తే దేశం ఇంకొక దేశానికి,బానిస అవుతుంది.

*స్వంత కొడుకు, భూమి పై నివసించే ప్రజలను హింసింస్తుంటే స్వంత తల్లి భూమాత నే నరకాసురున్ని చంపేయమని వేడుకుంటుంది.

*పెదనాన్న కొడుకు,భుమి కబ్జా చేసి, ఒక మహిళ యొక్క చీరలు లాగితే, భీముడు, అన్న అని చూడకుండా దుర్యొధనున్ని చంపేశాడు.

*స్వంత మామ, పాడి పంటలను నాశనం చేసి,అమాయక పిల్లలను చంపుతుంటే,కృష్ణుడు మామ కంసున్ని హతమార్చాడు.

*స్వంత తండ్రి. దేవుడు లేడని ప్రజలను నిరంకుశంగా ప్రజలను గర్వంతో బాధ పెడుతుంటే తండ్రిని, విష్ణువు తో శిక్షింపచేశాడు ప్రహ్లాదుడు..

*మూడు సార్లు యుద్ధానికి వచ్చినప్పుడు, పక్క దేశం కదా అని మన దేశం ఉదారంగా చూస్తూ వూరుకోక పాకిస్తాన్ తో యుద్ధం చేసి విజయం సాధించింది.

స్వంత కొడుకు తప్పు చేసినా సరె,సరియైన దారి లో పెట్టడానికి తల్లి కొడుకును శిక్షించటమనేది కర్తవ్యం.

ఈ దేశం లో పుట్టి,తిండి తిని, ప్రభుత్వ ప్రజాధనాన్ని ఉపయోగించుకుని, విద్రొహకార్యకలాపాలకు పాల్పడుతున్న వారు,వారికి మద్దతు ఇచ్చే వారెవరినైనా శిక్షించాల్సిందే..ఆ దేశద్రోహులను గుర్తించి,ప్రజలే, ప్రభుత్వానికి పట్టించాలి.వాళ్ళకు శిక్ష పడేట్లు చూడాలి..

మానసికంగా,శారీరికంగా నియమాలు పాటించకపొతే, దేహం రోగగ్రస్తమవుతుంది.

కుటుంబం లో వుంటు కొన్ని నిబంధనలు అనుసరించక పోతె, కుటుంబం విచ్చిన్నమవుతుంది.

దేశం లో వుంటూ రాజ్యాంగ నియమాలు ఆచరించక, వ్యతిరేకిస్తే దేశం ఇంకొక దేశానికి,బానిస అవుతుంది.

దేశాన్ని తాకట్టు పెట్టి రాజకీయాలు చేసే వారికి బుద్ధి చెప్పటం మన కర్తవ్యం.పార్టి, వ్యక్తులు ఎంత గొప్ప వారైనా , దేశాన్నే కాదనుకున్నప్పుడు వాడు డేశద్రొహి క్రిందనే లెఖ్ఖ.

మన జాతీయ జెండా.మన జాతీయ గీతం జణ,గణ,మన " వందేమాతర గీతం ,అలాగే " భారతీయులందరూ నా సహోదరులంటూ చేసే ప్రతిజ్ఞ ....ఇవన్నీ నేను రాజ్యాంగం ద్వారా ఏర్పరుచుకున్న నియమాలు ..వీటిని గౌరవించి పాటించటం..నా ప్రథమ కర్తవ్యం.వీటిని వ్యతిరేకించేవారు దేశద్రోహుల క్రింద లెఖ్ఖ.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. దేశం లో వుంటూ రాజ్యాంగ నియమాలు ఆచరించక, వ్యతిరేకిస్తే దేశం ఇంకొక దేశానికి,బానిస అవుతుంది

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers