Wednesday, February 4, 2015

సామాజిక సద్భావనకు పెట్టింది పేరు-రామాయం పేట గ్రామం


సామాజిక సద్భావనకు పెట్టింది పేరు ..ఇది రామాయం పేట గ్రామం ...హైదరాబాద్ నుండి కామారెడ్డి వెళ్ళే దారిలో వుంటుంది.ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి జీవిస్తారు. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో సామాజిక వివక్షత,వికృతులను తొలగించడానికి కొందరు వ్యక్తులు కలిసి శ్రీకారం చుట్టారు.దేమె భూమయ్య,క్రిష్ణా రెడ్డి,సాంగని యాదగిరి,నర్సింలు,లింగం,వెంకటేశం,లక్ష్మన్ యాదవ్ కిష్టయ్య గారి లక్ష్మారెడ్డి,బ్యాగరి నవీన్,యాదగిరి, తమ్మల రమేశ్ ఇలా మరి కొంతమంది కలిసి కార్యక్రమాలు రూపొందించి సద్భావనకు నాంది పలికారు.

రామాయం పేట మండలం లో 22 గ్రామాలు వుంటాయి..ఈ గ్రామాల్లోకి సమరసతా సందేశాన్ని తీసుకుని పోదామని యోజన చెశారు..22 గ్రామ సర్పంచులు,14 మంది ఎం పి టి సి లను సమరసతా వేదిక పైకి పిలిచి అంటరాని తనం వద్దని,ప్రజాప్రతినిధులుగా ఎటువంటి భేదభావం లేకుండా వివిధ కార్యక్రమాలు చేయాలని స్వామి కమలానంద భారతి ద్వార సందేశం ఇప్పించారు..శాలువతో స్వామిజి కర కమలాల ద్వార సత్కరింప చేశారు.

రామాయం పేటలో సుమారు 52 కులాలను గుర్తించి, ఆ సంఘాల పెద్దలను వేదికపైకి పిలిచి సన్మానించారు.అలాగె వివిధ వృత్తుల వారిని పిలిచి,ఆ వృత్తి యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియపరిచారు.మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.అంతకు ముందు స్వామిజీ ఎస్ సి బస్తీలో పాదయత్ర చెసి, రామాలయం లో ఎస్ సి ల తో సహా ప్రజలందరు ప్రవెశించి,పూజలు నిర్వహించారు.

వూర్లొ కొందరు సేవాభావం కలిగిన పెద్దలు పేదపిల్లలకొసం,అందులో చదువుకోవాలనే తపన కలిగిన విద్యార్థులను ఎంపిక చెసి,ఉచితంగానే వసతి,బట్టలు,ఆహారం,విద్య,వైద్యం వంటి సౌకర్యాలు కల్పిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు.ఇంజినీరింగ్ సుపెరింటెండెంట్ గా రిటైర్ అయిన క్రిష్ణా రెడ్డి గారి ఆధ్వర్యం లో పండరి,జితేందర్,వివేకానంద రెడ్డి ఇంకా మరికొంతమంది తో సేవా భారతి పర్యవెక్షణలో ఈ నిరుపేద విద్యార్థుల వికాస కార్యక్రమాలు జరుగుతున్నాయి.

1 comment:

  1. సామాజిక సద్భావనకు పెట్టింది పేరు-రామాయం పేట గ్రామం.

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers