Thursday, January 8, 2015

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యం లో దళితుల దేవాలయ ప్రవేశం

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యం లో దళితుల దేవాలయ ప్రవేశం.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళైనా సామాజిక వివక్షత అక్కడక్కడా మనసులను కలిచివేస్తుంటుంది.కాని మిరిదొడ్డి గ్రామం(మెదక్ జిల్లా) కులాలకు అతీతంగా ప్రజలు,ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజలు అందులో దళీత మహిళల ఆనందానికి హద్దుల్లేవు..గ్రామంలోని రామాలయం లోకి ప్రవేశించి,హారతులు ఇచ్చి పూజలు చేశారు.వారి ఆనందానికి అంతే లేదు..కేవలం కూడు,గుడ్డ,వసతి మాత్రమే కాదు..అవి పందులు,కాకులు కూడా కోరుకుంటాయి.మానసికంగా ఆనందం కోరుకుంటాడు మానవుడు..ఆ హృదయానందాన్ని ఇచ్చిన సంఘటన మిరిదొడ్డి గ్రామం లో జరిగి చరిత్ర లో నిలిచిపోతుంది.మఠాధిపతులు పూజ్య స్వామీజి కమలానంద భారతీ గారు మాల,మాదిగ బస్తీల్లో నడుస్తూ ఆశీర్వదిస్తుంటే వందలాది అన్నికులాల ప్రజలు కలిసి భజనలు చేస్తుంటే,1927 లో డా.అంబెద్కర్ కాలా రాం మందిర్ లోకి ప్రవేశించడానికి సత్యాగ్రహం చేసిన సంఘటన గుర్తొచ్చింది.కాని ఈ సారి సత్యాగ్రహం అవసరం రాలేదు.

జనవరి 6 వ తేది(2015) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన రాజగోపాలచారి(దేవాలయ పూజారి),వెంక టేశ్వర దేవాలయం సత్తయ్య స్వామి,గొట్టం రవి,కానుగంటి శ్రీను, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులానికి చెందిన గ్రామ సర్పంచ్ రోశయ్య ప్రధాన పాత్ర పోషించారు.ఇంకా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన కార్యకర్తలు,అంతేకాదు అన్ని కులాల పెద్దలు,సభ్యులు తమ గ్రామం సామరస్యత లో ,సద్భావనలొ ఒక ఉదాహరణగా వుండాలని ఆశించారు. దాని ఫలితమే అందరి మనసుల్లో ఆనందం పంచి పెట్టిన ఈ సంఘటన.

0 comments:

Post a Comment

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers