Wednesday, December 27, 2017

సంచార జాతి ప్రజలకు (పిట్టలోల్లు) చలి దుప్పట్లు పంపిణీ చేశారు.


నిరక్షరాస్యత, పేదరికం, జంతుబలులు, మద్యపానం, డబ్బు దుబారా మొదలైన రుగ్మతలతో సతమతమవుతున్న ఈ ప్రజలకు సామాజిక జాగృతిని కల్పించవలసిన అవసరం ఉంది.









సిద్దిపేట జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వున్న ముత్యంపేట గ్రామంలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో డిసెంబరు 24 ఆదివారం లయన్స్ క్లబ్ ప్రాయోజితం తో ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం పలకలు, వ్రాత పుస్తకాలు ఇవ్వగా, పొలాస గురుమూర్తి ప్రాయోజితం ( తన తల్లి స్మృత్యర్ధం)తో చలి దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే అజయ్ శర్మ గారి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతం, ఆ తరువాత అన్నదానం నిర్వహించారు.జిల్లా అధ్యక్షులు ఉప్పరి రత్నం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యోజన చేశారు. ముత్యంపేట లోని 75 పేద కుటుంబాలు, అందె గ్రామంలో ని 30 కుటుంబాలకు దుప్పట్లు అందజేశారు.
గ్రామ ఉపసర్పంచి గోపాల్ ,అందె గ్రామ ఉపసర్పంచి రాములు, ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ నరేశ్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖరరెడ్డి, కన్వీనర్ బల్ల సంతోష్, వెహికల్ ఇన్స్పెక్టర్ గంట రవీంద్ర, కనపర్తి రాకేశ్ , లక్ష్మణ్ ఉపాధ్యాయులు, శివరాజం , మాట్ల సుమన్ , ఆవాసం ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి, పిట్టల యాదగిరి, చంద్ర శేఖర్ , వడ్ల రాజు, రఘు ,జక్కుల మహేశ్,జక్కుల కర్ణా కర్, సూకూరి కరుణాకర్ ,గిరి, మాట్ల సతీష్, మాట్ల మహేష్ ల సహకారంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది.





0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers