Monday, December 18, 2017

కులభేదం మరిచి జీవిద్దాం -శ్రీ ఆదిత్యానంద స్వామి జీ


కులభేదం మరిచి జీవిద్దాం : 
శ్రీ ఆదిత్యానంద స్వామి జీ : 

పుట్టుకతో కాదు గుణకర్మలతోనే కులాలు ఏర్పడ్డాయని, కులభేదం మరిచి హిందువులంతా పరస్పర సహకారం తో జీవించాలని, అంటరానితనం మహా పాపమని ఆదిత్యానంద స్వామి ఉద్బోధించారు. ఖమ్మం నగరం లో  డిసెంబరు17 న ఆదివారం జరిగిన జిల్లా సమరసతా సమ్మేళనం లో స్వామిజీ ప్రసంగించారు. సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వంశతిలక్ ప్రసంగిస్తూ చెప్పులు కుట్టి జీవించే సంత్ రవిదాస్ భగవంతుని ఆరాధస్తూనే అన్నికులాల వారికి మార్గదర్శకులయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని కులాలలో గొప్ప వారు పుట్టారని , అందరూ స్వాభిమానం తో జీవించి జ్ఞానం సంపాదించాలని ఉన్నారు. రాష్ట్ర కన్వీనర్ అప్పాలప్రసాద్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్, కొమరమ్ భీమ్ వంటి గిరిజన వంశం లో జన్మించి, ప్రజాసేవలో అంకితం అయ్యారని తెలిపారు. 

రామకృష్ణ ఫంక్షన్ హాల్ లలో జరిగిన ఈ సమ్మేళనం లో 13 భజన బృందాలు పాల్గొన్నాయి. 22 మండలాల నుండి 2000 మంది అన్ని కులాల వారు పాల్గొన్నారు.ఇందులో 800 మహిళలు , 1200 పురుషులు ఉత్సాహంతో భాగస్వామ్యులయ్యారు. 

కామేపల్లి, కారెపల్లి,ముదిగొండ, ఏన్కూర్ ,తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల నుండి 200 చొప్పున ప్రజలు హాజరయ్యారు. ఒక వల్లభి గ్రామము నుండే 150 మంది పాల్గొనగా, అందులో 100 మంది మహిళలు వున్నారు. 150 మంది సంచార జాతి ప్రజలు పాల్గొన్నారు. వడ్డెర, దొమ్మర, కాటి కాపరి, వీరముష్టి, బండివడ్డెర , గంగాభవాని,మందుల,పరికి మగ్గల, జంగమ కులాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. బంజారా నుండి 400, కోయ,   గోండ్ల వంశం నుండి 400 మంది వచ్చారు.


 రాష్ట్ర కార్యదర్శి  కీసర జయపాల్ రెడ్డి (ఖమ్మం) నేతృత్వంలో 16 మండల సమరసతా కన్వీనర్ లు వారం రోజుల పాటు గ్రామాలు తిరిగి  వివిధ కులాల వారిని ఆహ్వానించారు.   

   జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్, కుంచనపు వెంకటేశ్వర్లు, బత్తుల గోపాల్, నాగరాజు, వీరన్న, బన్సిలాల్ , అలాగే ఎస్ సి ఎస్ టి అధ్యక్షులు కర్లపాడు లక్ష్మీ నారాయణ, కార్యదర్శి సుధీర్ దొర తో పాటు సమరసతా వేదిక గౌరవ అధ్యక్షులు పిట్టల లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.      

 20 సంవత్సరాలు గా పేద విద్యార్థులకు సేవలందిస్తున్న చావ బోసుబాబు( రఘునాథ పాలెం) ను, 20 సంవత్సరాలుగా అట్టడుగు వర్గాల ప్రజల్లో భజన గురువు లై మహిళల కు పాటలు, కోలాటం నేర్పిస్తున్న వారిని ఈ సందర్భంగా సత్కరించారు.  500 పైగా ఎస్ సి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నగరం లోని 7 బస్తీల నుండి అలాగే వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున హాజరయ్యారు. సామూహిక భోజనాలు, పరస్పర పరిచయాలతో సమ్మేళనం లో సమరసత వెల్లి విరిసింది.








0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers