భారత సంస్కృతి పరిరక్షణకై - సాగించాలి సాధనా
విజయపథమ్మున శ్రమించు తపించు - మాతృభూమి ఆరాధనా
జయహో భరతమాత జయహో
జయహో జగజననీ జయహో !!
1 విజ్ఞానం వీక్షించిన మునులు - పొంగిపొరలె మానవతా సుధలు
కణకణమున చైతన్యం నిండిన - సుందర జీవన భూమి ఇది
సర్వజనుల సంక్షేమం కోసం - చేద్దాం సర్వస్వార్పణా !!విజయపథమ్మున
2 ధర్మదండమును చేతబూనుదాం - భారత ప్రతిభను ప్రకటిద్దాం
ధనాకంక్షలను నియంత్రించుదాం - జీవనమున్నతి సాధిద్దాం
సాధారణ జన జీవితాలలో - చిరుదివ్వెలనే వెలిగిద్దాం !! విజయపథమ్మున
3 వైవిధ్యాలెన్నున్నా గాని ఏకాత్మతతో జీవిద్దాం
వైరుధ్యాలను అధిగమించుదాం - సమరస భావం నిర్మిద్దాం
జగమంతా మన కుటుంబమే - ప్రేమామృతమును పంచుదాం !! విజయపథమ్మున
ధర్మదండమును చేతబూనుదాం - భారత ప్రతిభను ప్రకటిద్దాం
ReplyDelete