అణుబాంబు దెబ్బ కు ధ్వంసం కాని 'గూడు ' ఏదైనా వుంటే అది 'యోగవిద్య ' మాత్రమే.
రాళ్ళు, లోహాల వంటి పదార్థాలలో వున్న శక్తి కన్న, మహత్తరమైన శక్తిని మానవ మనస్సు ల నుండి విడుదల చేయగలరని నిరూపించిన భారత యోగ విజ్ఞానాన్ని ప్రపంచం అంగీకరించి నందువల్లనే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అకస్మాత్తుగా చేసింది కాదిది. దీని వెనక మన పూర్వీకుల కృషి ఎంతో వుంది. వందల సంవత్సరాలుగా చాలా దేశాల్లోకి యోగాచార్యులను పంపి, శరీరాన్ని,మనసు ని సమైక్యంగా వుంచే సంపూర్ణ పద్ధతి ఇదేనని పాశ్చాత్య సైంటిస్టులను, తత్వవేత్తలను ఒప్పించింది.అణు రాక్షస శక్తి ప్రపంచం మీద విరుచుకు పడకముందే యోగశాస్త్రం కాపాడుతుందని , ప్రకృతి లోని వనరులను దోచుకోవడం కాదు ఆత్మ సంయమనము ఎలా పొందవచ్చునో చెప్పగల అంతర్ విజ్ఞానం యోగవిద్య ద్వారా మాత్రమే లభిస్తుందని పాశ్చాత్యులు అంగీకరించారు.
క్రీస్తుపూర్వం రెండవ శతాబ్ది కి చెందిన వాడిగా భావిస్తున్న పతంజలి మహర్షి ఎన్ని యుగాలకైనా కాలదోషం పట్టని, కాలానికి అతీతమైన సైన్సును ,వేదాలనుండి వెలికి తీసి ప్రపంచ ప్రజలకు వరప్రసాదంగా అందించారు. ఈ విద్య ను 'యోగవిద్య ' అని లేదా ' వేదవిద్య ' అని చెప్పాడే తప్ప 'పతంజలి విద్య' అని పేరు పెట్టలేదు. అంతేకాదు పేటెంట్ హక్కుల పేరుతో 'వ్యాపారముద్ర ' వెయ్యకుండా ప్రపంచ ప్రజల ఆస్తిగా ప్రకటించిన మహనీయులు పతంజలి మహర్షి.
- అప్పాల ప్రసాద్.
0 comments:
Post a Comment