Saturday, September 24, 2016

'భారత్ మాతాకీ జయ్' నినాదానికి ప్రత్యక్ష రూపమే సేవ





4రోజులుగా కురుస్తున్న వానలు ఎక్కువ శాతం ఆనందం కలిగించేవే అయినా తాత్కాలిక ఇబ్బందులు తప్పవు. ఏ ఇబ్బందులు వచ్చినా మేమున్నామని రంగంలో కి దిగి సేవ చేసే గుణం కలిగిన ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవకులు సహజంగానే భాగ్యనగరంలో లోతట్టు ప్రాంతాలలో, కాలనీల్లొ వరదలకు అడ్డు కట్ట లు వేశారు. ఆహార పొట్లాలు పంచారు. ఇక యూత్ ఫర్ సేవా కార్యకర్తల శ్రమ అనుపమానం. బాధితుల కుల,మతాల తొ సంబంధం లేకుండా వారి బాధలు పోగొట్టడమే నిజమైన భారత మాతాకీ జయ్ అంటే .......అని నిరూపించారు.
1947లొ పాకిస్తాన్ మూకల అత్యాచారాలనుండి ప్రజలను రక్షించారు.
1948లొ సైనికులు కాశ్మీర్ లొ దిగడానికి హెలిపాడ్ నిర్మించారు.
సర్దార్‌ వల్లభభాయి పటేల్, నెహ్రూ మొదట అనుమానించినా వీరి సేవలను కొనియాడి సత్కరించారు.
1965,1971,1962యుధ్ధాల్లొ సేవలు చేశారు.
1975 లో ప్రజాస్వామ్య పరిరక్షణకై జైళ్ళలో వున్నారు, బయట ఉద్యమం చేశారు.
తుఫాను, వరదలు, అతివృష్టి, అనావృష్టి లొ కూడా సేవలందించారు.
ఇప్పటికీ దేశంలో 1,50,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మంచి పనిచేసే వారిపై బురద చల్లటం, రాజకీయం చేయటం, అపనింద లు వేయడం రాముని, కృష్ణుని కాలంలో కూడా తప్పలేదు. ఎవరేమన్నా ప్రజల సేవలో అంకితమై పని చేసే ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకుల బాటలో నడుద్దాం. భారత్‌ మాతాకీ జయ్ అందాం.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. 'భారత్ మాతాకీ జయ్' నినాదానికి ప్రత్యక్ష రూపమే సేవ

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers