సామాజిక ఉద్యమ కారులు,సమాజ సేవకులు,ఆర్య సమాజ నాయకులు,విద్యావేత్త, నిర్విరామ సాహితీ కృషీవలురు 93 ఏళ్ళ వయస్సు కలిగిన శ్రీ టి వి నారాయణ ను మనమంతా సన్మానించుకుందాము.
1996-99 లో షెడ్యూల్డ్ కులాల,తెగల కమీషన్ ఆంధ్ర ప్రదేశ్ సభ్యులుగా పనిచేసారు. తెలుగు,హిందీ,ఆంగ్లం,సంస్కృతం , ఉర్దూ భాషలలో మంచి పట్టు గలిగిన వారు. ఎస్ సి లు వేదాలు వింటే చెవులో సీసం కరిగించి పోస్తారు అంటూ చెప్పే మాటలన్నీ బూటకాలని తెలియచేస్తూ, వేద విద్యలను నేర్చారు.ఉపనిషత్తులను అధ్యయనం చెసి,అందరికీ అర్థమయ్యేట్ల్లు ఆయన చిన్న చిన్న పుస్తకాలను వ్రాసారు. భారత రాష్ట్ర పతి వీరిని నేషనల్ హాండ్లూం డెవలప్ మెంట్ కమీషన్ కి డైరెక్టర్ గా నియమించారు. వీరు ఆ రంగం లో 3 ఏండ్లు పనిచేశారు.
హైదరాబాద్ సిటీ కళాశాల కు ప్రిన్సిపాల్ గా వున్నారు.ఆకాశవాణి,దూరదర్శన్ ల ద్వారా ఎన్నో ప్రసంగాలు చేశారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం అకడమిక్ సెనేట్ సభ్యునిగా గత 16 సంవత్సరాలుగా ఇప్పటికీ సేవలందిస్తున్నారు.
పొట్టి శ్రిరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు వీరి ఆధ్యాత్మిక రంగం లో కృఇషిని గుర్తించి," ధర్మ నిధి " అని బిరుదు నిచ్చి సన్మానించారు. నందీ పురస్కారాల కమిటీ సభ్యునిగా కళారంగానికి సేవలందించారు.కాకతీయ యూనివర్సిటీ సిండికేట్ సభ్యులుగా,సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ కి పాలక మండలి సభ్యులుగా పనిచేశారు.
వీరి ధర్మపత్నీ శ్రీ మతి సదాలక్ష్మి గారు 1960-67 మధ్య రాష్ట్ర ప్రభుత్వం లో మంత్రిగా పని చెయగా, నారాయణ గారు మాత్రం రాజకీయాలకు దూరంగా సమాజ సేవలో నిమగ్న మయ్యారు.
ఫిబ్రవరి 29 న సోమవారం,నాంపల్లి లో పబ్లిక్ గార్డెన్స్ లోని ఇందిరా ప్రియదర్శిని హాల్లో సాయంత్రం 5.30 గంటలకు జరుగు ఈ సన్మాన సభకు విచ్చేసి సమాజ సేవకులు టి వి నారాయణ గారిని సన్మానించుకుందాము.
- అప్పాల ప్రసాద్.
సామాజిక ఉద్యమ కారులు,సమాజ సేవకులు,ఆర్య సమాజ నాయకులు,విద్యావేత్త, నిర్విరామ సాహితీ కృషీవలురు 93 ఏళ్ళ వయస్సు కలిగిన శ్రీ టి వి నారాయణ ను మనమంతా సన్మానించుకుందాము.
ReplyDelete