Friday, September 25, 2015

సుభాష్ చంద్ర బోస్ కి భయపడి ఆంగ్లేయులు భారత్ ని వదలివెళ్ళారు


ఈ విషయాన్ని స్వయంగా బ్రిటిష్ ప్రధాని "క్లెమెంట్ అట్లీ" తెలియజేశారు. 

1956 లో అట్లీ భారత్ కి వచ్చినప్పుడు అప్పటి కలకత్తా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఫణిభూషణ్ చక్రవర్తి బ్రిటిష్ ప్రధాని ని "రెండవ ప్రపంచ యుద్ధం లొ గెలిచిన తరువాత కూడా,అలాగే 1942 లొ క్విట్ ఇండియా ఉద్యమం విఫలం అయిన తరువాత కూడా భారత్ ని తొందరగ ఎందుకు వదలివెళ్ళవలసి వచ్చిందని అడిగినప్పుడు అట్లీ ఇచ్చిన సమాధానం.
"బ్రిటిష్ సైన్యం లో వున్న భారతీయ సైనికులలో సుభాష్ చంద్రబోస్ దేశభక్తి ని నింపి,జాతీయ ఉద్యమాన్ని నడిపాడు.బ్రిటిష్ వారితో పోరాడి 60,000 భారతీయ సైనికులు ప్రాణాలర్పించారు..అయినా కూడా సుభాష్ చంద్రబోస్ పట్టువదలకుండా సాగించిన యుద్ధం బ్రిటిష్ వారిని హడలెత్తించిందంటే అతిశయోక్తి కాదు.దేశంలోనూ,అలాగే అంతర్జాతీయంగానూ సుభాష్ చంద్ర బోస్ లేవనెత్తిన ప్రచండ ఉద్యమం బ్రిటిష్ దేశానికి మరింత హాని , నష్టం కలుగచేస్తుందని భయపడి భారత్ ని వదలిపెట్టాము".
ఈ విషయం ఇప్పటి ప్రజలకు తెలియపరచకుండా ఎందుకు దాచి వుంచారు?మహాత్మా గాంధి నడిపిన అహింసా ఉద్యమాన్ని తక్కువ చేయటం లేదు.అయితే సుభాష్ జరిపిన వీరోచిత యుద్ధాన్ని ఎందుకు దాచివుంచారనేదే ముఖ్యమైన ప్రశ్న. కాంగ్రెస్ మరియు కమ్యూనిష్టులు చేసిన కుట్ర వల్ల స్వాభిమాన సమాచారం మన ప్రజలకు తెలియకుండా పోయింది..
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. సుభాష్ చంద్ర బోస్ కి భయపడి ఆంగ్లేయులు భారత్ ని వదలివెళ్ళారు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers