డిల్లీ కెంద్రీయ విద్యాలయ సంఘటన లో యోగ శిక్షకుడిగా వుంటున్నాడు.అంతే కాదు డిల్లీలో ముస్లిం జన ప్రాబల్యమున్న ప్రాంతాల్లో యోగ నేర్పిస్తాడు.వేలాది ముస్లిములు యోగ ను పాటిస్తూ ఖురాన్ బోధనలకు ఇది విరుద్ధం కాదని చాటి చెపుతున్నారు.గత 35 సంవత్సరాలుగా యోగను అభ్యసిస్తున్న డా.బద్రుల్ ఇస్లాం మాట్లాడుతూ కొందరు కావాలనుకుని యోగను తప్పుగా అర్థం చేసుకుని మాట్లడుతున్నారని అంటాడు.యోగ గురించి ఒక చిన్న చేతి పుస్తకాన్ని కూడా ఉర్దూ లో వ్రాశాడు.ఇంటర్నేషనల్ యోగ డే జూన్ 21 న డాక్టర్ ఇస్లాం ఒక పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. అసద్ గాజి అనే ముస్లిం విద్యావంతుడు చెప్పేదేమిటంటే యోగ వల్ల శారీరికంగా దృఢమై ,దేశం కూడా బలంగా రూపొందుతుందని అంటాడు.అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా యోగ ఉపాధ్యాయులను నియమించాలని అంటాడు. కేరళ లోని శివానంద ఆశ్రమంలో 13 ఏళ్ళుగా యోగ నేర్చుకుంటున్న ఇమ్రాంఖాన్ 'మా అమ్మా నాన్న లు తనను ప్రొత్సహిస్తున్నారని అంటాడు.అంతెందుకు ? ఆల్ ఇండియ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వ్యతిరేకిస్తుంటే దారుల్ ఉలూం సంస్థ(ఇస్లాం) మాత్రం యోగ అభ్యాసం ఆరోగ్యానికి మంచిదని 2008 లొ ప్రకటించింది.. అయినా కూడా అసదుద్దిన్ ఒవైసీ యోగ కు వ్యతిరేకంగా ముస్లిములను రెచ్చగొడుతున్నాడు. సోనియా గాంధి అల్లుడు రాబర్ట్ వాద్రా యోగను వద్దంటున్నాడు. 175 దేశాల్లో 46దేశాలు ముస్లిం దేశాలు,మిగతావి క్రిస్టియన్ దేశాలు యోగ కు మద్దతుగా అంతర్జాతీయ యోగ దినోత్సవానికి మద్దతిచ్చాయి.మన దేశంలో ఇదేమి వైపరీత్యం.ఏ దేశాల్లో లేని వింత జాఢ్యం.ప్రజలను విడదీసేందుకు ప్రతి అవకాశాన్ని జారవిడుచుకోకుండా కాచుకుని కూర్చున్న మత,రాజకీయ,కమ్యూనిస్ట్ గుంట నక్కలు తమకున్న మీడియా,పత్రికల,రాజకీయాల ఆధారంగా తెగ వాగుతున్నాయి. ప్రజలను భ్రమలకు గురిచేస్తున్నాయి.
- అప్పాల ప్రసాద్.
యోగ ఒక హిందూ మతాచారమా? కాదంటాడు డాక్టర్ బి.ఇస్లాం
ReplyDelete