Saturday, September 24, 2016

Yuga Yugala Bharatamata Putrulam Pavitrulam-యుగ యుగాల భరతమాత పుత్రులం పవిత్రులం


యుగ యుగాల భరతమాత పుత్రులం పవిత్రులం 
నరనరాన దేశభక్తి పొంగులెత్తు శక్తులం 

1.ప్రళయ ఝంఝ మారుతం - హైందవం మహాధ్బుతం 
  జగతిలో మహోన్నతం - ధర్మజనుల భారతం 
  అజేయ యోగ శక్తిరా...
  అజేయ యోగ శక్తిరా - అభేద్య భరత ధాత్రిరా 
  శత్రుమూక చుట్టుముట్టె - మట్టుబెట్టు సైనికా        !! యుగ యుగాల 

2.గాండివం,సుదర్శనం - భవాని ఖడ్గ ధారులం
  ఇనుపకండరాలు,ఉక్కు నరాలున్న యువకులం
  స్వతంత్ర సమర హోమాగ్నిలో సమిధలం,యోధులం 
  స్వర్ణ చరిత పుటలలో - అఖండ కీర్తి ధాములం
  జ్ఞాన శీలవంతులై...
  జ్ఞాన శీలవంతులై - హనుమ భీమ బంటులై 
  ధర్మ రక్ష దీక్ష మనది - ఆగకుండ సాగుదాం  !! యుగ యుగాల

3.హిందుసంద్ర హిమనగం - గంగ సింధు సాగరం 
  ధీర గంభీర జలధి - నిత్య స్పూర్తిదాయకం
  గ్రీకు హూణ శక కుషాణు లణచినావు భూసుతా
  మొఘలు ఆంగ్ల దొరల మెడలు వంచినావు ధీరుడా
  అడుగడుగున విజయమే...
  అడుగడుగున విజయమే - ఆగదీ ప్రభంజనం 
  దేశధర్మ రక్షణకై - సాగుతోంది జనపదం    !! యుగ యుగాల

4.హిందుసైన్య తాండవం - ప్రళయ కాల గర్జనం 
  ఫణవ, భేరి, శంఖనాద, తాళ యోగ ఘోషణం 
  పదం పదం భుజం భుజం - సంచలనం ధరాతలం
  త్రివిక్రముల్ త్రిలోకముల్ - నిలిచె హిందువైభవం
  మడమ త్రిప్పవద్దురా....
  మడమ త్రిప్పవద్దురా - పిడికిలి బిగియించరా
  దుశ్శాసన దుర్మార్గుల తరిమి తరిమి కొట్టరా      !! యుగ యుగాల

1 comment:

  1. Yuga Yugala Bharatamata Putrulam Pavitrulam-యుగ యుగాల భరతమాత పుత్రులం పవిత్రులం

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers