Saturday, September 24, 2016

పాకిస్తాన్ ఏర్పడిందే భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి

 ప్రపంచ పటం లొ పాకిస్తాన్‌ లేని విధంగా మన సైన్యం ప్రతీకారం తీర్చుకోడానికి ఉవ్విళ్ళూరుతున్నది.
ఉగ్రవాదం, తీవ్రవాదం, ఇస్లాం మతోన్మాదం కలగలిపి భారత్ ని నాశనము చేయడానికి పాకిస్తాన్ కంకణం కట్టుకున్నది. సౌది అరేబియా నిధులతో ప్రపంచానికి టెర్రరిస్టులను ఎగుమతి చేస్తుంది. అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం చెప్పుచేతల్లో నడుస్తున్నది. 
పాఠశాల స్థాయిలో భారత్ ని శత్రువు గా చూపిస్తూ పాఠాలు బోధిస్తున్నది. ఇస్లాంమతాన్ని అడ్డు పెట్టుకొని భారత్ లోని ముఖ్యంగా కాశ్మీరు ముస్లిములను రెచ్చగొట్టి, ఆ దేశంలోకి తీసుకుని వెళ్లి తీవ్రవాద శిక్షణ ఇస్తుంది. ముస్లిం లైనా బంగ్లాదేశ్ లోని వేలాదిమంది మహిళ లపై పాకిస్తాన్ సైన్యం అత్యాచారాలు జరిపింది. సింధు, బెలూచిస్థాన్‌లో వేలాదిమంది తోటి ముస్లిముల ను ఊచకోత కోస్తున్నది. ఇక ఇతర మతాల వారిపై జరిపే అకృత్యాలు అంతులేకుండా వున్నాయి. ప్ర పంచాన్ని ఒక క్యాన్సర్ పుండు వలే తొలుస్తున్నది. ఏకోణంనుంచి నుంచి చూసినా పాకిస్తాన్ తన ప్రజలకే కాదు ప్రపంచానికే ఉపయోగ పడకపోగా ఈర్ష్యా ద్వేషాలు, మదం, మాత్సర్యాలు, హింసా ఉన్మాదాలతో ప్రపంచ ప్రజలకు హాని కలిగించే ప్రమాదకరమైన దేశం పాకిస్తాన్.
ఆ దేశంలో వున్న అణ్వస్త్రం, పిచ్చి వాని చేతిలో రాయి వలె ఎప్పుడైనా ప్రయోగించక మానదు. ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక, వాణిజ్య, రాజకీయ శక్తి గా ఎదగాలన్న ఆలోచన లేదు. భారత దేశాన్ని ముక్కలు చేయడానికి కాశ్మీర్ ను బూచి గా చూపి కుట్రలు పన్నడం ఒక విధానం గా నడిపిస్తోంది. వేలాదిమంది భారత సైనికులు ఒక పిచ్చివాడి చేతిలో సమిధలు గా మాడి పోవడం దేశభక్తులను కలచివేస్తున్నది.
దూరదృష్టి లోపించిన నెహ్రూ మొదలుకొని అందరు పాలకులు నేటి వరకూ పాకిస్తాన్ పై చర్యలు తీసుకోకుండా చేసిన తాత్సారంవల్ల, పైగా ఇక్కడి ముస్లిం ల ఓట్ల కోసం సాగించిన బుజ్జగింపు రాజకీయం , అమెరికా, చైనా లు అందించిన సహకారాలు పాకిస్తాన్ ని ఒక భస్మాసురునిగా తీర్చదిద్దాయి. 
ఈదేశంలోని బర్ఖాదత్ వంటి పత్రికా విలేకరులు, కమ్యూనిస్టు నాయకులు బహిరంగంగా టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నారు. 
కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, 18మంది దేశంకోసం మరణించిన సైనికులకు నివాళులు అర్పించడానికి కూడా ధైర్యం చాలటం లేదు. అధికార కాంక్ష లో దేశాన్ని అమ్ముకునే నాయకులకు ప్రజలు పట్టం కడుతున్నారు . తమ కుల సంఘాల రాజకీయాలు తప్ప దేశం అక్కర్లేని గల్లీ నాయకుల సంఖ్య బాగానే కనిపిస్తుంది. 
సినిమా నటులు, క్రికెట్ ఆటగాళ్ళు సైనికుల బలిదానానికి గట్టిగా స్పందించారు. కాని వారి వీరాభిమానులైన యువకులకు మాత్రం కనీసం సోయ లేదు. 
దళిత రాజకీయాలు నడిపే నాయకులు తమ కులం వాడు చస్తే 2,3 నెలల పాటు ధర్నాలు, ప్రకటనలు, సరిహద్దులొ సైనికులు మరణిస్తే కనీసం సానుభూతి తెలపని మేధావులు, దళితులు తలచుకుంటే దేశం తరఫున యుధ్దం చేయరంటూ వ్యాసం వ్రాసిన ఒక దళిత విద్యావంతుని దుర్మార్గపు ఆలోచనలు తీవ్రంగా ప్రబలుతున్నాయి.
సరిహద్దులో ప్రమాదం పొడసూపితే కేంద్ర ప్రభుత్వం తో, ప్రధాన మంత్రి తో ఎకసెక్కాలు ఆడుతూ రాజకీయాలు నడిపే వాళ్లు అక్కడక్కడా కనిపిస్తున్నారు.

అయితే ఇదంతా వేళ్లపైన లెక్కపెట్టె స్థాయిలో వుంది. కాకపోతే మీడియాలొ వీరి ప్రభావం బలంగా వున్నా, దేశమంతా ప్రజలు పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. ఇక మన సైన్యం ప్రతీకారం తీర్చుకోడానికి ఉవ్విళ్ళూరుతున్నది.లాల్ బహదూర్ శాస్త్రి తరువాత అంతటి సమర్థవంతమైన ప్రధానిగా నరేంద్ర మోడి ని నేడు చూస్తున్నారు. నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం, సైన్యం ఐనప్పటికీ భారతీయులంతా సంపూర్ణంగా మద్దతిస్తున్నారు.
దెబ్బకు దెబ్బ, పన్నుకు పన్ను, పన్నుకు దౌడ, ముళ్ళు ను ముళ్ళు తోనే తీసే పద్ధతులు అవలంబించి పాకిస్తాన్ ని ఓడించాలని అందరి అభిలాష. భవిష్యత్తులో ఇంకెప్పుడూ భారతదేశం పై కన్నెత్తని విధంగా గుణపాఠం నేర్పాలి.

- అప్పాల ప్రసాద్.

1 comment:

 1. పాకిస్తాన్ ఏర్పడిందే భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి

  ReplyDelete

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers