Thursday, June 16, 2016

ఈ పల్లెటూర్లోని గుళ్ళో అన్ని కులాలవారికి ప్రవేశం వుంది






మాల మాదిగలను దూరంగా వుంచాలనే ఆలోచన ఏ వూర్లో ఎవరికి రాదు..
అందరిని సమదృష్టి తో చూడాలని కాంక్షిస్తుంది ఈ గ్రామం.
కరీం నగర్ జిల్లాలోని మెట్ పల్లి మండలానికి దగ్గరలొ వున్న గ్రామం ' మెట్ల చిట్టాపూర్ '.
ఈ వూర్లో కొత్తగా 4 సంవత్సరాల క్రితం నిర్మించిన రామాలయం పూజారి శ్రినివాసాచారి ,వచ్చిన వారందరిలో కులాలను కాదు భక్తులను చూస్తాడు.శ్రీ రామ కల్యాణం వేళ అన్ని కులాల వారికి సామూహిక భోజనం పెడతారు.ముత్యం పేట, గంగారావ్ పేట గ్రామాల నుండి ఈ గుడిని సందర్శించడానికి వస్తారు.
ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి రోజున 14 కుల వృత్తుల వారిని, అలాగే గ్రామ పంచాయితి పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించింది ఈ వూరు.
సర్పంచ్ రాజెందర్ రెడ్డి ఆధ్వర్యం లో నెలకు ఒకటి, రెండు ధార్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.ప్రజల మధ్య సామరస్యత నిర్మాణానికి నిరంతర ప్రయత్నం జరుగుతున్నది ఈ వూర్లో. కీర్తి శేషులు సింగి రెడ్డి వెంకన్న బ్రతికున్న సమయం లో కూడా వారు అందరిని సామరస్య దృష్టి తో చూడాలని కాంక్షించేవారట.

- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. ఈ పల్లెటూర్లోని గుళ్ళో అన్ని కులాలవారికి ప్రవేశం వుంది

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers