Thursday, June 2, 2016

అ)సంత్ సేవాలాల్ , ఆ)హాథియా బాబాజి, ఇ)వేమన...సమానత్వం కోసం కృషి చేశారు


అ)సంత్ సేవాలాల్ , ఆ)హాథియా బాబాజి, ఇ)వేమన...సమానత్వం కోసం కృషి చేశారు.
అ)సంత్ సేవాలాల్ మహరాజ్ సాధు జీవులను, గోవులను రక్షించిన మహానుభావుడు.
15 ఫిబ్రవరి 1741 లో అనంతపూర్ జిల్లా గుత్తికోట ప్రాంతం లో జన్మించిన సేవాలాల్ 12 ఏళ్ళ వయసులొనే ఎన్నో మహిమలు చూపాడు.
నిజాం నవాబ్ మెడలు వంచి, బంజార సంస్కృఇతిని , గొవులను రక్షించాడు.1.తోలజ భవాని,2.మత్రాళ్ భవాని, 3.సీతాళా భవాని,4.హింగలా భవాని, 5. కంకాళా భవాని,6.దోళాంగార్ భవాని, 7.మేరామా భవాని ఇలా సాతి భావానులను పూజించే ఈ సంప్రదాయం పేరెన్నికగన్నది..
ఇస్లాం,క్రైస్తవ మతాలు మతాలు మారుస్తుంటే, స్వధర్మాన్ని వదలి పెట్టొద్దని, దేశమంతా తిరిగుతూ కులభేదాలు పాటించ వద్దని,అన్ని కులాల్లో మహనీయులు జన్మిస్తారని ప్రచారం చేశాడు.ఏప్రిల్ 12, 1806 నవమి రోజున దేహ త్యాగం చేశారు.
ఆ)వెంకటేశ్వర స్వామితొ పాచికలాడిన బాబాజి( బంజారా సంప్రదాయం)
750 మిత్రులతో, అపార గోసంపద తో తిరుమల కొండ కు వెళ్ళి, బాబాజి ( అసలు పేరు హాతియా) అక్క్డే తపస్సులో మునిగి, 14 ఏళ్ళు గడిపిన హాతియా వద్దకు స్వయంగా వేంకటేశ్వర స్వమియే వృద్ధ రూపం లో వచ్చి దర్శనమిస్తాడు.పాచికలాడుతాడు.స్వామి ఓడిపోతాడు. తన దగ్గరున్న బంగారు కడియం, బంగారు పాచికలు ఇచ్చి వెళ్తాడు.
హాథీరంజీ గా పేరుపొందిన ఈ బాబాజి..
సకల ప్రాణులను ప్రేమించమంటాడు.మానవునిలో మాధవుణ్ణి చూడమన్నాడు.
ఇప్పటికి తిరుమలలొ హాథీరాం మఠం వుంది..వేలాదిమంది దర్శనం చేసుకుంటారు.
ఇ)విశ్వదాభి రామ..వినుర వేమ..
17 వ శతాబ్దపు వేమన 'విశ్వదాభి రామ ..వినుర వేమ ' అను ఆటవెలది పద్యాలతో సమాజం లోని అసమానతలను ఈటెలతో పొడుస్తాడు.వేమన రెడ్డి కులం లో జన్మించినా కూడా అన్ని వర్గాల కుళ్ళును కడిగివేశాడు.అలాగే మంచి పని చేస్తే కులానికి మంచి పేరు వస్తుందని, చెడు చేస్తే వంశప్రతిష్ట దెబ్బతింటుందని కూడా చెప్పాడు. ప్రజా కవిగా, పతిత పావనుడిగా పేరు తెచ్చుకున్నాడు.
జ్ఞానోదయం పొందిన నిమ్న కులాలాలవారి పాదాల ముందు అన్ని కులాల వారు సాగిల పడ్డారు.ముమ్మిడివరం బాలయోగి నిమ్న వర్గానికి చెందినా కూడా వారు జ్ఞాని గా ప్రసిద్ధి గాంచాడు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

 1. అ)సంత్ సేవాలాల్ , ఆ)హాథియా బాబాజి, ఇ)వేమన...సమానత్వం కోసం కృషి చేశారు

  ReplyDelete

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers