Wednesday, June 8, 2016

మళయాల స్వామి, గైక్వాడ్ రాజు మరియు సాహు మహరాజు--నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు




మళయాల స్వామి, గైక్వాడ్ రాజు మరియు సాహు మహరాజు--నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు.

అ) మళయాల స్వాములవారు

శూద్రులకు, స్త్రీలకు వేద విజ్ఞానాన్ని అందించడానికి తిరుమల క్రింద 1926 లో ఏర్పేడు ఆశ్రమాన్ని స్థాపించారు మళయాల స్వాములవారు..తిరుమలపై వున్న గోగర్భం లో 12 ఏళ్ళు తపస్సు ఆచరించి ఇంటింటా భగవద్గీతను ప్రచారం చేశారు.

1928 లో వేంకటేశ్వర సంస్కృత పాఠశాల,1935 లో కన్యా గురుకులం ప్రారంభంచారు.

గ్రామీణ ప్రాంతం లోని వారికి ధర్మ ప్రచారం చేశారు.

పశువులు, పక్షులు, వృక్షాలు మొదలైన వాటిలో వివిధ రకాలు చూసి వుంటాం కాని భగవంతుడు మానవులను మాత్రం ఒకే విధంగా సృష్టించాడని చెప్పి, సమరసత తో జీవించాలని చెప్పారు.

ఆ) డా అంబెద్కర్ ని ఆదుకున్న బరోడా రాజు సయాజి రావ్ గైక్వాడ్( 1875-1939)

అన్ని దానాల్లో విద్యా దానం గొప్పదని భావించాడు..సంస్కృత భాష ప్రజలందరికీ అందుబాటు లో వుంచాలని బోధించాడు.

ఈ రాజు మహాత్మ ఫూలేకు, అంబేద్కర్ కు, అరవింద ఘోష్, దాదా బాయ్ నౌరోజి కి ఆర్థికంగా సహకరించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

నిమ్న వర్గాల విద్యా వికాసానికి కృషి చేశారు.

ఇ ) కుంభీ కులస్థుడు కోళ్హా పూర్ రాజు సాహూ మహరాజు అట్టడుగు వర్గాలవారికి చేయూత నందించాడు.

1894 లో 20 సంవత్సరాల వయస్సులో రాజయ్యాడు.

1902 లోనే వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించాడు.

మీ సామాజిక హక్కులకు భంగం కలిగినప్పుడల్లా పోరాడాలని పిలుపునిచ్చాడు.కాని కసి, ద్వేషం తో కాకుండా, ప్రేమ, వివేకం తో ఉద్యమించాలని ఉద్భోధించాడు.
- అప్పాల ప్రసాద్.

2 comments:

  1. మళయాల స్వామి, గైక్వాడ్ రాజు మరియు సాహు మహరాజు--నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు

    ReplyDelete
  2. మ "ళ" యా "ల" కాదండి, మ "ల" యా "ళ" అన్నది సరైన ఉచ్ఛారణ.
    (ఆ భాషలో "మల" అంటే కొండ. "మలయాళం" అంటే కొండప్రాంతం అని అర్ధం. అదే ఆ భాష పేరు కూడా అయింది.)

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers