Thursday, June 2, 2016

సంత్ రవి దాస్...మరియు ..సంత్ కనకదాస్


సంత్ రవి దాస్...మరియు ..సంత్ కనకదాస్
కులతత్వం తరిమి, భక్తితత్వంని ప్రచారం చేశారు.
ఆగ్రా ప్రక్కన దాసపుర గ్రామం లో మాదిగ కులానికి చెందిన సంత్ రవిదాస్ కి ఇప్పటికీ కాశీ పట్టణం లో పీఠముంది. వేలాదిగా భక్తులు ఆ పీఠాన్ని దర్శించుకుంటారు.1376-1526 మధ్యలో రామానందుని శిష్యుడై,శాంతి ప్రేమలను అందించాడు.సాక్షాత్తు దేవుడే వచ్చి కోరికలు తీర్చే 'పరుసవేది ' ని ఇచ్చినా తాకనేలేదు.తన హృదయాన్ని భగవదర్పణం చేశాడు.పుట్టుకతో ఎవరూ ఉన్నతులు కాలేరు..తన గుణ కర్మలతో అవుతారని చెప్పాడు.రారాజులెందరో సంత్ రవిదాస్ కి శిష్యులయ్యారు.
కుర్మ కులం లో పుట్టిన కనకదాస్ భజనలు పేరెన్నిక గన్నాయి.
ప్రారంభం లో ముస్లిముల దాడుల నెదుర్కొని, ఆ తరువాత వైరాగ్యం పొంది, హరిభక్తుడయ్యాడు.
ఉడుపి లో శ్రికృష్ణ ఉత్సవం లో పాల్గొన్నాడు.భక్తి పారవశ్యం తో మునిగి కీర్తనలు చదివాడు.
ఒక అర్చకుడు కనకదాస్ ని వెళ్ళగొట్టాడు.
అప్పుడు గుడి వెనకకు వెళ్ళి గానం చేశాడు.
గోడలు బీటలు వారి, శ్రీ కృష్ణుడు దర్శనమిచ్చాడు.
ఇప్పటికీ ఉడుపిలో పశ్చిమాన ఏర్పాటైన కనకదాస్ కిటికీ నుండే శ్రీకృష్ణుని దర్శించాలి.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. సంత్ రవి దాస్...మరియు ..సంత్ కనకదాస్

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers