Monday, April 11, 2016

జాతీయ జండాగా కాషాయం, అధికార భాషగా సంస్కృతం వుండటం సరియైనది..డా.అంబేద్కర్.


భారత్ లో బౌద్ధం ఎందుకు అదృశ్యం అయింది ?
పాకిస్తాన్ లో లక్షల దళితులు ఎమయ్యారు?

జాతీయ జండాగా కాషాయం, అధికార భాషగా సంస్కృతం వుండటం సరియైనది..డా.అంబేద్కర్.

800 సంవత్సరాల ముస్లిముల ఆక్రమణలు లక్షలాది బిక్షువుల ప్రాణాలు తీసాయి.వేలాది బుద్ధ విగ్రహాలు కూల్చివేయబడ్డాయి.ప్రాణాలు అరచేతిన పెట్టుకున్ బౌద్ధ బిక్షువులు ఈ దేశం వదలి పారిపోవల్సి వచ్చిందని డా అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.1940 లో.థాట్స్ ఆన్ పాకిస్తాన్ అను పుస్తకాన్ని వ్రాసి డా అంబేద్కర్ చేదు నిజాల్ని బయట పెట్టారు.ముస్లిం లీగ్ చేసిన దౌర్జన్యకర చర్యలు దేశ విభజనకు దారి తీసాయన్నారు.కాంగ్రెస్ విభజనను ఆపలేక పోయిందన్నారు.ముస్లిం లేగ్ ను కోరుతూ అఖండ హిందుస్తాన్ ను ఒప్పుకోవాలని అంగీకరించాలన్నారు.ఒకవేళ విభజన చేయవలసి వస్తే భారత్ లోని ముస్లిములంతా పాకిస్తాన్ కి, పాకిస్తాన్ లోని హిందువులంతా భారత్ కి వస్తేనే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని సూచించారు..వారి మాటలను పెడచెవినపెట్టిన కారణంగా పాకిస్తాన్లో హిందువుల ఊచకోత,ముఖ్యంగా 13 లక్షల దళితులను పాక్ ముస్లిములు చంపివేశారు. 1949 లో నవంబర్ 25 న మాట్లాడుతూ వచ్చిన మన స్వాతంత్ర్యాన్ని కాపాడుకొవాలని కోరారు. కులాల,వర్గాల పేరుతో శతృత్వాలను పెంచి దేశాన్ని బలహీనం చేయవద్దని కోరారు.గతం లో మనం వోడిపోవడానికి భారత్ లోని నమ్మక ద్రోహులు, విశ్వాసఘతకులు చేసిన చర్యల కారణంగా రాజపుత్రులు, మరాఠాలు ఓడిపోయారు.ఆంగ్లేయులు ఇక్కడి ఇక్కడి విభజన రేఖల బలహీనతల ఆధారంగా గెలిచి నిలిచారని అంబేద్కర్ గుర్తుచేసారు.

( ఈ రోజు ఆ విశ్వాసఘాతకుల పాత్రను పొషిస్తున్నదెవరు..కంచ ఐలయ్య, ఒవైసీ సోదరులు కాదా.? వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని కుల రాజకీయాలు,,దళిత రాజకీయాలు చేస్తున్న చేస్తున్నవారెవరో ప్రజలకు తెలియదా.? ) అందుకే రాజ్యాంగ సభలో 1949 లో అంబేద్కర్ ' చరిత్ర పునరావృతమవుతుందేమోనని భయపడుతున్నట్లు వారు వివరించారు.

సంస్కృత భాష అధికార భాషగా వుండాలని,అది పురోభివృద్ధి చెందే వరకు ఆంగ్ల భాష 15 సంవత్సరాలు ప్రత్యామ్నాయంగా వుంచాలని ప్రతిపాదించారు.మంత్రులు నసీరుద్దిన్ ,బి వి కేస్కర్ అంబేద్కర్ ని సమర్థించారు.అయితే ఇంకొక మంత్రి బి పి మౌర్య మాత్ర దానిని వ్యతిరేకించటం తో ఆ విషయం అలాగె వుండి పోయింది..ఆ తరువాత బి పి మౌర్య తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడ్డారు..వారి కూతురు ఇప్పుడు సంస్కృత భాషా వ్యాప్తికి కృషి చేస్తుంది.

జాతీయ పతాకం కాషాయం వుండాలని ప్రజాభిప్రాయం కూడగడితే ఆ ఉద్యమానికి నా మద్దత్తు వుంటుందని డా అంబేద్కర్ తనను కలువ వచ్చిన హిందూ మహా సభ కార్య కర్తలతో నిర్మోహమాటంగా చెప్తారు

.(అయితే 3 రంగుల జండా ను నిర్ధారించినా ఇప్పటి వరకు ఆ జండా కొసం ప్రాణాలు అర్పిస్తుంది జాతీయ వాదులైన సంస్తల కార్యకర్తలు కాదా? జె ఎన్ యు లో , హెచ్ సి యూ లోని కొందరు విద్రొహ విద్యార్థులు జాతీయ జండాను, జాతీయ భావనలను గాయపరుస్తుంటే వారికి అండగా నిలుస్తున్నదెవరు.? కాశ్మీర్ లో జాతీయ జండాను మోస్తూ, జాతీయ గౌరవాన్ని కాపాడుతున్నదెవరు? హెచ్ సి యూ లో కాకిమాధవ రావ్, కంచ ఐలయ్య,మల్లెపల్లి లక్ష్మయ్య విద్రోహ విద్యర్థులకు అండగా నిలిచి, అదే కాశ్మీర్ విద్యార్థులు పోలీస్ చేతుల్లో రక్తం కారుస్తూ జాతీయ జండాను పట్టుకుంటే ఆ విద్యార్థులకు ఈ విద్యావంతులు ఎందుకు మద్దతు పలకలేదు.? ఈ ప్రశ్నలు మేము అడగక పోయినా సామాన్య ప్రజలకు అర్థం కాదని అనుకోవటం భ్రమ మాత్రమె..కాషాయాన్ని, సంస్కృతాన్ని చూడగానే ఒళ్ళంతా విషం ఎక్కి చిందులు వేసే విద్యార్థులను మోటివేట్ చేస్తున్నది కంచ ఐలయ్య మొదలైన వారు కాద.మరి డా అంబేద్కర్ కి నచ్చని పనులు ఎందుకు చెస్తున్నట్లు? ఆయన ఫోటొ పెట్టుకుని ఆయన భావాలను ఎందుకు గాయపరుస్తున్నారు? )
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. భారత్ లో బౌద్ధం ఎందుకు అదృశ్యం అయింది ?

    పాకిస్తాన్ లో లక్షల దళితులు ఎమయ్యారు?


    జాతీయ జండాగా కాషాయం, అధికార భాషగా సంస్కృతం వుండటం సరియైనది..డా.అంబేద్కర్.

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers