Tuesday, March 1, 2016

ఖమ్మం పట్టణం లోని మామిళ్ళగూడెం వివేకానంద పాఠశాలలో సైన్శ్ ఎగ్జిబిషన్


చిన్నారి మెదళ్ల సృజనకు దర్పణంగా సైన్స్ ఎక్స్ పో నడిచింది. మామిళ్ళగూడెంలోని శ్రీ వివేకానంద విద్యానికేతన్ హైస్కూల్ లో ఫిబ్రవరి 22 న నిర్వహించిన ప్రదర్శన విద్యార్థుల్లో సాంకేతిక స్ఫూర్తి నింపింది. చిన్నారి మెదళ్లలో సైన్స్ ఆలోచనలకు భీజాలునాటేందుకు వేదికగా నిలిచింది. పలువురు చిన్నారులు రూపొందించిన సైన్స్ నమూనాలు ఆలోచింపజేసేవిధంగా ఉన్నాయి. ఈ వార్షిక విద్యా సైన్సు ప్రదర్శన ప్రారంభ సభకు ఆ పాఠశాల అధ్యక్షురాలు వక్కలంక శారద ప్రారంభ ఉపన్యాసం చేశారు. విద్యా సాంకేతిక రంగాల్లో దేశం ఎంతో పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను ఆ దిశగా సన్నద్ధం చేయాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తుచేశారు. అబ్దుల్ కలాం, సి.వి. రామన్ జగదీస్ చంద్రబోస్ లను ఆదర్శంగా తీసుకొని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని తెలియజేశారు. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిచెందిన దేశాలకు సమాన స్థాయిలో పోటీనిస్తోందన్నారు. భారతీయుల జీవన విధానంలోనే నూతన ఆవిష్కరణ మూలాలు ఉన్నాయని గుర్తుచేశారు. వేదాలు, ఉపనిషత్తుల కాలం నుంచే ప్రపంచాన్ని అబ్బురపర్చే ఆలోచనలు ఈ దేశంలో సాగాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, గణిత శాస్ర్తానికి సంబంధించిన మోడళ్లు, తెలుగు హిందీ విభాగాలకు సంబంధించిన చార్టులు ప్రదర్శించారు. విద్యార్థులు వారి నైపుణ్యాలను చాటిచెప్పేలా ఆయా విభాగాలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులు ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. పాఠశాల కరస్పాండెంట్ వక్కలంక సత్యానంద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

1 comment:

  1. ఖమ్మం పట్టణం లోని మామిళ్ళగూడెం వివేకానంద పాఠశాలలో సైన్శ్ ఎగ్జిబిషన్

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers