Monday, December 29, 2014

కేవలం క్యాలండెర్ లొ మార్పు వస్తే శుభం ఎలా కలుగుతుంది


జనవరి ఫస్ట్ న శుభం జరగాలని ' విష్ యూ హ్యాపి న్యూ ఇయర్ ' అని చెపుతాం కదా? కేవలం క్యాలండెర్ లొ మార్పు వస్తే శుభం ఎలా కలుగుతుంది?ఖగోళం ప్రకారం వాతావరణం లో జరిగే మార్పుల వల్ల మన శరీరం లో మార్పులు వస్తాయని సైన్స్ చెప్పుతున్నదని నీకు తెలుసుకదా? అందుకే వైరస్ ప్రబలేందుకు అవకాశమున్న ఆ తరుణం లో వేప పచ్చడి తో ఆ వైరస్ ని నిరోధించవచ్చునని మన పూర్వీకులు ఎన్నడో చెప్పారు,అది నిజమని నేటి శాస్త్ర జ్ఞులు కూడ ఒప్పుకుంటున్నారు కదా? అందుకే వసంత ఋతువు లో వచ్చే ఉగాది అందరికి శుభం కలుగ చేస్తుందనటం లో సందేహం అసలే లేదు.కొత్త వేప,కొత్త బెల్లం,కొత్త చెరకు ఇలా కొత్త అందాలను నింపుకునే ప్రకృతి వాతావరణంలో ఉగాది కొత్త సంవత్సరం జరుపుకోవటం ఎంత శాస్త్రీయమో,సమంజసమో కొంత కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే..ఆంగ్ల బానిసత్వానికి వీడ్కోలు పలికి,భారతీయ పద్దతులను మళ్ళీ ఆధునికతకు అనుగుణంగా అందరికీ అందచేసినప్పుడే మన జన్మకు సార్ధకత ఏర్పడుతుంది...ఏమంటారు? డిశంబర్ 31 ని మాములుగానే పోనియ్యండి..క్యాలండెర్ ని జనవరి 1 కి మాములుగానే మార్చండి. ఆ ఒక్క రాత్రి ఎప్పుడూ పడుకున్నట్లే,నిద్ర పోయి, ఆ ఒక్క రోజును మరిచిపోతే మీ జన్మ ధన్యమైనట్లే! మన ఉగాది కొత్త సంవత్సరం ఏమి నేర్పుతుంది.?..సూర్యోదయం తో పండుగ మొదలవుతుంది.కనుక డిసంబర్ 31అర్థరాత్రి పిచ్చి పనులకు అవకాశం లేదు.ఉదయం తల స్నానం చేసి ,దేవున్ని మొక్కి,కొత్త బట్టలు తొడిగి,బంధువులు,తల్లిదండ్రులు,స్నేహితులతో కలిసి వేప పువ్వు పచ్చడిని తీసుకుంటాం.పొరుగువాళ్ళకు పంచుతాము.ముగ్గులు,మామిడి తోరణాలతో అలంకరించుతాము.ఆరోగ్యకరమైన పచ్చడి, సాంప్రదాయ భోజనాలు స్వీకరిస్తాము. సాయంత్రం దేవాలయం వెళ్ళి,లేదా రచ్చబండ వద్ద పంచాంగ శ్రవణం తో గడుపుతాము. ఖగోళం ప్రకారం కాలమనం లెక్కించే పద్దతి తెలుస్తుంది.జీవితం లో నియమ బద్ధత ఏర్పడుతుంది.ఆద్యాత్మిక ప్రశాంతి ఏర్పడుతుంది.కుటుంబమంతా సంతోషంగా వుంటుంది.తప్ప త్రాగటం, తూలటం,పిచ్చిగా వాగటం ఏమీ వుండవు.మన ఉగాది పండుగ మనకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పుతుందంటే ....ఉగాదిని మనం ఎందుకు ఘనంగా జరుపుకోకూడదు? ఈ విషయాన్ని అందరికీ ఎందుకు అర్థం చేయకూడదు? రక రకాలైన కాలేయ సంబంధమైన రోగాలకు కారణమైన మద్యం త్రాగటం కంటె...వేపపువ్వు,కొత్తబెల్లం,శనగపప్పు,అరటిపళ్ళు,మామిడిముక్కలు,కొబ్బరిముక్కలు,చెరకు గడలు మొదలైన వాటితొ ఉగాది పచ్చడి చేసుకుని త్రాగితే నిజంగా ఆరొగ్యం కాదా? డిశంబర్ 31 ని మాములుగానే పోనియ్యండి..క్యాలండెర్ ని జనవరి 1 కి మాములుగానే మార్చండి. ఆ ఒక్క రాత్రి ఎప్పుడూ పడుకున్నట్లే,నిద్ర పోయి, ఆ ఒక్క రోజును మరిచిపోతే మీ జన్మ ధన్యమైనట్లే!

హ్యాపీ న్యూ ఇయర్,డిశంబర్ 31 రాత్రి 12 గంటలు,ఆంగ్లేయుల ఈ కొత్త సంవత్సరం చివరికి మనకు నేర్పుతున్నదేమిటి? డిశంబర్ 31 అర్థరాత్రి క్లబ్బుల్లోనూ,హోటల్స్ లోనూ,ఇళ్ళలోనూ,తోటల్లోనూ,రోడ్లమీదా...ఆడ,మగ తేడాలేకుండా గుంపులు..గుంపులుగా జనం చేరుతున్నారు.ఇందులో యువతీ యువకులు ఎక్కువగా వుంటున్నారు.వెస్టర్న్(పాశ్చాత్య)మ్యూసిక్ ల హోరులో,జోరులో,కేరింతలతో,చిందులేస్తూ అల్లరిచేస్తూ, కాలం గడుపుతారు.కొందరు పేకాట వంటి జూదాలు ఆడితే,మరి కొందరు మత్తుపదార్థాలు సేవిస్తారు.ఇలా వివిధ రకాలైన దురభ్యాసాలతో,అసభ్యరీతుల్లో ప్రవర్తిస్తుంటారు.రోడ్లపై పరుగులు,అరుపులూ,గోల,కేకలు... రాత్రి సమయమంతా టెలివిజన్ చానల్స్ విదేశీ సంగీత నృత్యాలతో రెచ్చిపోతున్నారు.షాంపైన్ బాటిల్స్ ఒపెన్ చేస్తూ ఆ నురగల్లో ఉబ్బితబ్బిబ్బైపోతారు.అర్థరాత్రి పిశచాల ఆనందం అంటే ఇదేనేమో? ఈ దురాచారం నగరాల నుండి గ్రామాలకు ప్రాకిపోయింది. అందరూ చేస్తున్నారు..మేము చేయకపోతే ఎలా అంటూ గొర్రెల మందలా అనుసరిస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్,డిశంబర్ 31 రాత్రి 12 గంటలు,ఆంగ్లేయుల ఈ కొత్త సంవత్సరం చివరికి మనకు నేర్పుతున్నదేమిటి? తాత్కాలికి ఎంజాయ్ మెంట్ ,దురలవాట్లు,మన స్వంత ఆచారాలను,సంప్రదాయాలను తెలుసుకోలేని అజ్ఞానం,విచ్చలవిడితనం,అనవసర ఖర్చులు.. గత పన్నెండు నెలలుగా చేసిన మంచి ఆలోచనలు,నోములు,వ్రతాలు,దేవాలయ దర్శనాలు ,మొక్కులు,మొక్కుబడులు,హిందూమతం,భారతీయ భావన ....బూడిదలో పోసిన పన్నీరులా, మనదంతా విదేశీయులకు ధారపోసి ఆ ఒక్క అర్ధరాత్రి డిశంబర్ 12 గంటలకు ఆ కొద్ది సేపు ఆంగ్లేయుల అలవాట్లకు సాష్టాంగ పడి,సరెండర్ అయి పోయి, బానిస బ్రతుకులుగా మారిపోవటం ఎంత బాధాకరమో,అవమానకరమో,ఎంత మూఢాచారమో,ఎంత అజ్ఞానమో,స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ళు గడిచినా,మనం మారేది ఎప్పుడో? అని మీకు మీరు అలోచించుకోవటం కోసమే ఇదంతా చెప్పేది! అంతే కాని బలవంతంగా చెప్పలేము కదా? ఈ స్వేచ్చాయుత దేశం లో ఆలోచించమని చెప్పగలము అలాగే గుడ్డిగా ఏదీ కూడా అనుసరించవద్దని విన్నపం చేయగలం.

సైన్స్ తెలిసిన వాళ్ళం అని మనం చెప్పుకుంటాం కదా? వూరందరిదీ ఒకదారి అయితే,వులిపి కట్టెది మరో దారి" అన్నట్లు మనం ఎందుకు వుండాలి?,నలుగురితో పాటూ నారాయణా' అన్నట్లు వుండాలి కదా?ప్రపంచమంతటా జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ గా జరుపుకుంటే మనం ఆచరిస్తే తప్పేమిటి?అదేమైన నేరమా? కానే కాదు.జనవరి ఫస్ట్ టు డిశంబర్ ఎక్కువమంది జరుపుతున్నారు.కాదనను.కాలమానం,ఖగోళం ప్రకారం 'జనవరి ఫస్ట్' న్యు ఇయర్ కాదని, మనకు న్యూ ఇయర్ 'ఉగాది ' అని మాత్రమే తెలుసుకోవాలి.చదువుకున్నవాళ్ళమని,ఆధునికులమని,సైన్స్ తెలిసిన వాళ్ళం అని మనం చెప్పుకుంటాం కదా? "జనవరి ఫస్ట్ " సైన్స్ ప్రకారం న్యూ ఇయర్ కాదని తెలిసి కూడా ఎలా..ఎందుకు జరుపుకోవాలో చెప్పగలమా?మనం ఖగోళ శాస్త్రం అనుసరించి వేల సంవత్సరాలుగా కాలమానం లెక్క పెడుతుంటే,వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంగ్లేయులు మన దేశం తో పాటూ 71 దేశాలపై ఆక్రమణ చేసి, బలవంతంగా వాళ్ళ క్యాలండర్ ని,కాలమానంగా రుద్దినందు వల్ల మనం పాటిస్తున్నాము.ఇప్పుడు ఆంగ్లేయులు లేరు కదా? ఇప్పటికైన నిజాలు,గుణపఠాలు నేర్చుకుని నడవటం బుద్ధిమంతుల లక్షణం కాదా చెప్పండి?

గడియారం 12 కొట్టగానే మూర్చ వచ్చినట్టు....

మనందరికీ ఎంతో కొంత సైన్స్ తెలుసు.నక్షత్రాలు,గ్రహాలు,ఉపగ్రహాలు,తోకచుక్కలు,గ్రహశకలాలు మొదలైన వాటి గురించి తెలిపే శాస్త్రమే ఖగోళం.మన న్యూ ఇయర్ అంటే "ఉగాది" ఖగోళం ప్రకారం వస్తుంది.జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళకు అలా రాదు.వ్యక్తులు నిర్ణయించిన న్యూ ఇయర్ అది.మన పండుగలు అలా కాదు.గడియారం 12 కొట్టగానే మూర్చ వచ్చినట్టు,ఆవేశంగా వూగిపోతూ మన యువకులు వెర్రెక్కిపొతుంటే,వీళ్ళేనా మన వివెకనంద,శివాజీ,రాణాప్రతాప్,భగత్ సింగ్ తమ్ముళ్ళు?క్రికెట్ లో ఇంగ్లాండ్ ని వోడించిన మన భారత క్రికెట్ యోధుల అభిమానులు వీరేనా? 7లక్షల భారతీయ యువకులు 90 సంవత్సరాలు ఆంగ్లేయులతో పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని,ఆ అమరవీరుల ఆత్మల్ని,ఒక్క డిశంబర్ 31 అర్ధరాత్రి రోజునే బ్రిటిష్ వాళ్ళు అందించిన బీరు,బ్రాందీ,విస్కీ బాటిళ్ళతో మన వాళ్ళను మనమే చంపుకుంటున్న యువకులు బహుశా ఏ దేశం లో కూడా ఉండరేమో అనిపిస్తుంది.

0 comments:

Post a Comment

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers