Wednesday, August 20, 2014

స్వదేశీకి ప్రేరణ - వినాయకుడి ఆరాధన


ఈస్ట్ ఇండియా కంపనీ మన చిన్న,గ్రామీణ,కుటీర పరిశ్రమలను దెబ్బతీసింది. కోట్ల విలువైన ముడిసరుకును ఈ దేశం నుండి దోచుకునిపోయి,తయారైన వస్తువులను మళ్ళీ మన దేశంలోనె అమ్ముతూ లాభాలు గడించి మన సంపదను లూటీ చేసుకుపోయింది.భారత దేశంలోని వ్యాపార,వాణిజ్య,వ్యవసాయ,గనులు మరియు అటవీ సంపద అంతా తెల్లవాళ్ళ ఆధీనము లోకి రావడానికి చట్టాలు తెచ్చి ఆర్థిక వ్యవస్థను స్వాధీనం చేసుకున్నది.ఈ బ్రిటిష్ వారి కుటిలనీతి అర్థం కాక,సామాన్యులే కాదు విద్యావంతులు కూడ బానిసలై జీవించ సాగారు.అదే సమయం లోనే 1905లో 'విభజించి పాలించు ' అన్న దుర్మార్గ విధానంతో బెంగాల్ ను వంగ విభజన పేరుతో రెండుగా చీల్చే ప్రకటన చేసి దేశంలో చిచ్చుపెట్టారు ఆంగ్లేయులు.ఆ సమయంలొనే చిచ్చుర పిడుగై బాల గంగాధర్ తిలక్, ప్రజల మధ్యలో,ప్రజల భాషలో ఆంగ్లేయుల నయ వంచనను కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ స్వదేశీ ఉద్యమాన్ని అన్ని వైపులా కొనసాగించారు.విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చాడు.తిలక్ కంటే ముందు మహ దేవ గోవింద రానడే డిసంబర్ 1872,ఫిబ్రవరి 1873లలో విదేశీ ఆర్థిక కుట్రలను తన ఉపన్యాసాల ద్వారా చీల్చి చెండాడాడు.అది వారస్వత్వంగా గ్రహించి తిలక్ గణపతి,శివాజి ఉత్సవాల ద్వారా చరిత్రను సృష్టించాడు.అన్ని కులాలను కలిపే మహదవకాశం గణపతి పండుగకు లభించింది.ఇంకేమి కావాలి? అందరూ ఏకమయ్యారు.స్వదేశీ విప్లవ శంఖం పూరించబడింది.ప్రజలు విదేశీ వస్తువులను సేకరించి ఒక దగ్గర్ కుప్పగా పోసి తగులపెట్టారు.ఆంగ్లేయులు నివ్వెరపొయారు.అంతే ...వంగ విభజన ఆగిపోయింది. ప్రజా ఉద్యమానికి నాయకుడు తిలక్ ఐతే ,ప్రజా హృదయాలలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన వాడు వినాయకుడు.అందుకే వినాయకుడా?మజాకా?..
- అప్పాల ప్రసాద్.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers